మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం .

 




' మహాశివరాత్రి లింగోద్భవ అభిషేకం, కళ్యాణం '


   విజయవాడ (ప్రజా అమరావతి);

మహా శివరాత్రిని పురస్కరించుకొని  బుధవారం రాత్రి మల్లేశ్వర స్వామి వారి ఆలయం లో 

రాత్రి 9 గంటల నుండి మహన్యాసం నిర్వహించగా, తదుపరి లింగోద్భవ అభిషేకం, మహా నివేదన, హారతి మంత్రపుష్పం కార్యక్రమములు భక్తి శ్రద్దలతో జరిగాయి.

అనంతరం  శ్రీ గంగా, పార్వతీ(దుర్గా )సమేత మల్లేశ్వరస్వామి వార్ల దివ్య లీలా కళ్యాణోత్సవ క్రతువు వైభవంగా ప్రారంభమై, పండితుల మంత్రాలు, మంగళవాయిధ్యాల నడుమ కన్నుల పండువుగా ఆది దంపతుల కళ్యాణం జరిగింది.

ఈ కార్యక్రమం లో స్థానాచార్య శ్రీ శివ ప్రసాదశర్మ, ప్రధాన అర్చకులు శ్రీ మల్లేశ్వర శాస్త్రి,,ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Comments