గుంటూరు. (ప్రజా అమరావతి);
కూటమి బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా మాట్లాడుతూ
పట్టభద్రుల ఎమ్మెల్సీ గా నామినేషన్ వేయడానికినేను వస్తే నాకోసం వచ్చిన వీరందరినీ చూస్తే చాలా గర్వాంగా ఉంది.
గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల అభ్యర్ధిగా నన్ను కూటమి ఎన్నికచేయడం చూస్తే రాజకీయ రుణం తీర్చుకొనేందుకు మరొ అవకాశం కల్పించారని కూటమి నేతలను కొనియాడిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ ...
33 నియోజకవర్గాల పరిధిలోని పట్టభద్రుల సమస్యలపై పోరాటం చేయడానికి కూటమి అవకాశం కల్పించింది...
కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా నా విజయానికి పనిచేస్తున్న వారి తీరును చూస్తే పనిచేసే వారికి అవకాశం కల్పిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు..
ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ యువత, పట్టభద్రుల సమస్యలు పరిష్కరించటానికి అందరితో కలిసి పనిచేస్తానని హామీ ఇచ్చారు...
ప్రజల తరపున సేవచేయడానికి కూటమి నేతలు మాత్రం నాకు మరో సదవకాశం కల్పించారు...
సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టే కూటమి ప్రభుత్వం నాకు ఇలాంటి అవకాశం కల్పించారు
రాష్ట్రంలో ప్రజలే కూటమి ప్రభుత్వ నికి గత ఎన్నికల్లో విజయాన్ని ఇచ్చారు.
ఎన్నికలు వస్తే తోకముడిచి పారిపోయే పార్టీ వైసీపీ ,
వాళ్లుకు పోటీ చేయాలనే ధైర్యం లేకనే పక్కకు తప్పుకున్నారు...
ఎన్నికల అనేది విషయం వైసీపీ వాళ్లకు అనవసరం అనే తోకముడిచి పారిపోయారు...
ప్రజలంటే భయం, ప్రజా సమస్యలంటే పట్టవు, దోపిడివిధానంపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు...
అలాంటి వైసీపీ గురించి మాట్లాడటం అనవసరం,ఇలాంటి సమయంలో వారి గురించి మాట్లాడకూడదు.
గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి అశేష జన వాహిని మధ్య మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా ఊరేగింపుగా కలెక్టర్ ఆఫీస్ కి చేరుకొని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే, వేస్ట్ ఎమ్మెల్యే, నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీలు అశోక్ బాబు ,
నాయకులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment