ఎపిడబ్ల్యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణ.

 ఎపిడబ్ల్యూజెఎఫ్ డైరీ ఆవిష్కరణ




  తెనాలి ఫిబ్రవరి 19 (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్-2025 నూతన డైరీని తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనాసింహ బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆంద్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం సేకరించిన రాష్ట్ర మంత్రివర్గ వివరాలతోపాటు అన్ని ప్రభుత్వ శాఖల  సమాచారాన్ని డైరీ లో పొందుపరిచారు. తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహ  డైరీ ఆద్యంతం తిలకించారు. జిల్లా నాయకులు కనపర్తి రత్నాకర్, అంబటి శ్యామ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి ఫెడరేషన్ గౌరవ సభ్యులు షణ్ముఖరావు, నాయకులు ఎస్.ఎస్ జాహీర్, సిహెచ్ చంద్రశేఖర్, అచ్యుత సాంబశివరావు, డి కోటేశ్వరరావు, వేమూరు నాయకులు మేకల సుబ్బారావు, అత్తోట సంజయ్, సభ్యులు దేవరపల్లి నాగరాజు, దాసరి వెంకటేశ్వరరావు, ఉన్నాం భూషణం, వి నాయుడు తదితరులు పాల్గున్నారు.

Comments