*ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు కూటమి నేతల మద్దతు*
*టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపిటిఎఫ్ అభ్యర్ధి రఘువర్మ గెలుపు ఖాయం : పల్లా శ్రీనివాస్ రావు
*
విశాఖపట్నం (ప్రజా అమరావతి);
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏపిటిఎఫ్ (ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య) పాకలపాటి రఘువర్మకు కూటమి నేతలు మద్దతు తెలిపారు. రఘువర్మ గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షలు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు రఘువర్మకు మద్దతు ఇవ్వడం జరిగిందన్నారు. వైకాపా పాలనలో గాడి తప్పిన విద్యావ్యవస్థను చక్కదిద్దాంలంటే రఘువర్మకు ప్రభుత్వ,ప్రైవేట్ ఉపాధ్యాయులు మద్దుతు ఇవ్వాలని కోరారు. విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలను మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రఘువర్మకు ఓటేస్తే ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల కోసం కృషి చేస్తారని అన్నారు. గతంలో విద్యారంగంలో జరిగిన అన్యాయాలపై పలుమార్లు ఉత్తరాంధ్రలో గొంతెత్తిన చరిత్ర రఘువర్మది అని ఆయన అన్నారు. ఈ నెల 27న జరుగుతున్న ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలుపు ఖాయం” అని ధీమా వ్యక్తం చేశారు.
addComments
Post a Comment