అమరావతి (ప్రజా అమరావతి);
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. 68 శాతం ఓటింగ్ జరగడంపై రాజేంద్రప్రసాద్ హర్షం బులిబుచ్చారు. చంద్రబాబు పాలన ప్రజా పాలన కాబట్టే తమకు గెలుపునందించబోతున్నారని ఆలపాటి రాజ తెలిపారు. ప్రత్యర్థులెవరనేది కాదు ప్రగతికి ఓటేయాలని మేము నినదించామని చెప్పారు. టీడీపీ నేతలతో కలిసి కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల్లో తనకు సహకరించిన కూటమి నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో *మాజీ మంత్రి ఆలపాటి రాజ*తోపాటు ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు , ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ లు పాల్గొన్నారు.
addComments
Post a Comment