'ఇంద్రకీలాద్రి పై మహాశివరాత్రి ప్రత్యేక పూజలు
'
విజయవాడ (ప్రజా అమరావతి);
మహా శివరాత్రి సందర్బంగా బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు శ్రీ మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అభిషేకములు భక్తి శ్రద్దలతో జరిగాయి.
ఉదయం 6 నుండి ఉదయం 9 వరకు,
ఉదయం 10 నుండి మద్యాహ్నం 01 వరకు,
తిరిగి మధ్యాహ్నం 2 నుండి మల్లేశ్వరునికి ప్రత్యేక అభిషేకములు నిర్వహించడం జరిగింది.
మహా శివ రాత్రి పురస్కరించుకొని శ్రీ దుర్గా మల్లేశ్వరుల ఆలయాలు పుష్ప అలంకరణ తో విరాజిల్లాయి.
తెల్లవారు జాము నుండి పవిత్రకృష్ణా నదిలో భక్తులు పుణ్య స్నాన్నాలాచరించి, అనంతరం మల్లేశ్వరుని దర్శనం కోసం బారులు తీరారు. భక్తులకు స్వామి వారి సత్వర దర్శనం, త్రాగు నీరు, ఉచిత ప్రసాదం, అన్న ప్రసాదములు సకాలంలో అందేలా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. దుర్గాఘాట్, మల్లేశ్వర ఆలయం, అమ్మవారి ప్రధాన ఆలయం ప్రాంతాలలో సిబ్బంది కి ప్రత్యేక విధులు కేటాయించారు.మైక్ ప్రచారం ద్వారా ఎప్పటికప్పుడు భక్తులకు తగు సూచనలు చేసి, రద్దీ నియంత్రణ చేయడమైనది.
ఆలయ కార్య నిర్వహణాధికారి శ్రీ కె. రామచంద్ర మోహన్ అధికారులు, సిబ్బంది కి తగు సూచనలు చేసి, భక్తులకు ఏ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకున్నారు.
addComments
Post a Comment