రైతులకు మా హయాంలోనే మేలు చేశాం... చర్చకు సిద్ధమా జగన్ రెడ్డి...?

 

అమరావతి (ప్రజా అమరావతి):


రైతులకు మా హయాంలోనే మేలు చేశాం... చర్చకు సిద్ధమా జగన్ రెడ్డి...?


మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 




మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కష్టాల్లో ఉన్న మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్లినట్టు లేదు. ఏదో డ్రామా ఆడటానికి వెళ్లినట్టు ఉంది. లేకపోతే సీఎం సీఎం అంటూ స్లోగోన్స్ ఏంటి, డ్యాన్సులు ఏంటి. పైగా రైతులకు చెందిన 14 బస్తాల మిర్చిని లేళ్ల అప్పిరెడ్డి మనుషులు ఎళ్తుకెళ్లిపోయారు. రౌడీలు, దొంగలను తీసుకెళ్లి జగన్ రెడ్డి రైతు పరామర్శ పేరుతో డ్రామా ఆడారు. మీ ప్రభుత్వంలో నల్ల తామర తెగులు సోకి లక్షల ఎకరాల మిర్చి పంట దెబ్బ తిన్నప్పుడు ఎందుకు రైతులను పరామర్శించలేదు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీని మూడో స్థానంలో పెట్టావ్. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానానికి తీసుకెళ్లావ్. అప్పుడు ఎందుకు రైతులు గుర్తుకురాలేదు. మా హాయంలో ప్రతిష్టాత్మకంగా రూ.2,300 కోట్లతో రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ ను దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రారంభించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశావ్.  2017-18 లో యాంత్రికరణలో రూ.650 కోట్లు ఖర్చు చేశాం. సూక్ష పోషకపదార్థాలు కొనలేని రైతులకు అండగా ఉన్నాం. 100 శాతం సబ్సిడీతో  రైతులకు  జింక్, సిప్సన్, బోరాన్ ఫ్రీగా ఇచ్చాం. మూటలు మూటలు ట్రాక్టర్లలో తీసుకెళ్లారు. రైతులకు టార్పాలిన్, స్పే గన్ ఇవ్వని పరిస్థితి మీ ప్రభుత్వంలో ఉంది.  దేశంలో సగటు రైతు అప్పు రూ.74,500 ఉంటే... ఒక్క ఏపీలోనే నీ హయాంలో రూ.2.40 లక్షలు ఉంది దానికి కారణం నువ్వు కాదా. ధాన్యం కొన్న ఆరు నెలలకు గాని మీ హాయంలో డబ్బులు పడలేదు. మేము ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం. 09-01-2020  జీఓ 28 విడుదల చేసి రెడ్ చిల్లి క్వింటాల్ రూ.7 వేలకే కొన్నారు. 2023 లో కూడా అదే జరిగింది. కానీ ఈ రోజు మా ప్రభుత్వ హయాంలో రూ.11 వేల నుంచి రూ.14 వేలకు పలుకుతుంది. రోజూ రూ.500 పెరుగుతూనే ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు క్లియర్ గా 10 అంశాలతో కేంద్రానికి లేఖ రాశారు. మిర్చి ధరలపై రేపు ఢిల్లీలో  కేంద్ర మంత్రిని కలవబోతున్నారు.  మీ  హయాంలో ఢిల్లీకి వెళ్లి ఏనాడైనా రైతుల గురించి మాట్లాడావా.. ఎంతసేపు కేసులు, జైలు, బెయిల్ గురించి మాట్లాడావే తప్ప. 2017 లో మిర్చి రైతులకు రూ.1500 క్వింటాల్ కు బోనస్ ఇచ్చాం. మీరు ఎప్పుడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. రైతుల విషయంలో దారుణాలు చేసింది జగన్ రెడ్డి. డ్రిప్ ఇరిగేషన్ కు 60 సబ్సిడీ కేంద్రం ఇస్తే... 40 శాతం మనం ఇవ్వాలి. అది రద్దు చేశావ్. ఎవడు ఇచ్చాడు నీకు ఆ హక్కు. ఐ ప్యాక్, పేటీఎం టీం ఏం చెబితే అది చేస్తున్నావ్. నవ్వాలో ఏడావాలో తెలియడం లేదు. వస్తావ్ రెండు రోజులు షో చేస్తావ్ మళ్లీ బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లావ్. అన్ని రంగాల్లో అందరినీ మోసం చేశావనే నీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు.  9 నెలలు కూడా కాలేదు నువ్వు ఈ రోజు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నావ్. ఇలాంటివి ఆపేసి చర్చకు రా దమ్ముంటే. మీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఏం చెప్తాడు. కరువు మండలాలతో మాకు సంబంధం లేదు కేంద్రం చూసుకుంటుంది అన్నారు. మిర్చికి రూ.7 వేలు ఇచ్చిన నువ్వు ఈ రోజు డ్రామాలు ఆడుతున్నావ్. 2014 -19 మధ్య వ్యవసాయ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నేను సిద్ధం. మీ మాజీ మంత్రులు కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డిలు ఎవరిని పంపిస్తావ్ చర్చకు. నేను సిద్ధం, మీరు సిద్ధమా. నీ హయాంలో ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు గుర్తుందా. మా హయాంలో ఐఎస్ఐ మోటర్లు ఫ్రీగా ఇచ్చాం. నువ్వు వాటిని రద్దు చేశారు. ఒక్క రూపాయి లేకుండా ఫ్రీగా ఇచ్చాం అది మూసేశావ్. ఇలాంటి దారుణాలు రైతుల విషయంలో చేసిన నువ్వు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే నవ్విపోతున్నారు.  చైల్డ్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చి డ్రామాలు ఆడిస్తున్నావ్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివే అమ్మాయికి అమ్మఒడి రాలేదని నిన్న మాట్లాడిస్తున్నారు నీ పేటిఎం బ్యాచ్. ఆ అమ్మాయి వాళ్ల నాన్నకి బంగారు షాప్ ఉంది. గురజాలలో మూడు అంతస్థుల బిల్డింగ్ ఉంది. టాలీవుడ్ లో చైల్డ్ ఆస్టిస్టుల కొరత ఉందని... మీ పేటీఎం బ్యాచ్ చైల్డ్ ఆర్టిస్టులను తయారు చేస్తున్నారు. మా ప్రభుత్వంలో ఎకరాకు మిర్చి 30 నుంచి 35, 40 క్వింటాలు వచ్చేది. మీ హయాంలో 10 కే పడిపోయింది. అప్పుడు రైతులను పరామర్శించావా... ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఈ రోజు షో చేస్తున్నావ్. పేటీఎం బ్యాచ్ వల్లే వై నాట్ 175 అన్నావ్. వై నాట్ 25 ఎంపీ సీట్స్ అన్నావ్. ఏమైంది 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చొబెట్టారు. నిన్న వంశీని పరామర్శించడానికి వెళ్లి మగవాళ్ల అందం గురించి జగన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మగవాళ్ల అందం గురించి మగవాళ్లు మాట్లాడటం ఏంది?. నాకు ఏదో తేడా కొడుతుంది జగన్ రెడ్డి. విజయమ్మ ఎలాగు లేదు. భారతమ్మ అయినా మంచి సైక్రియార్టిస్ట్ కి జగన్ రెడ్డిని చూపిస్తే బాగుంటుంది.

Comments