*కుంభమేళా పవిత్ర సంగమంలో పుణ్య స్నానాలు చేసిన పవన్ కళ్యాణ్ దంపతులు
*
అమరావతి (ప్రజా అమరావతి):
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రయాగ రాజ్ త్రివేణి సంగమంలో మహకుంభ మేళా సందర్భంగా కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు చేశారు. మంగళవారం ఉదయం హైదరాబాదు నుంచి నేరుగా ఆయన సతీసమేతంగా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ వద్ద త్రివేణి సంగమం చేరుకున్నారు. పవన్ సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్ తదితరులు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మహా కుంభమేళాలో...
పితృదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు రావడం తన అదృష్టమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా పుణ్యస్నానం చేసి తరించాలని ఆయన సూచించారు. పవన్ కల్యాణ్ వెంట ఆయన సతీమణి, కుమారుడు అకీరానంద్ తో పాటు మిత్రులు, ప్రముఖ సినీ దర్శకులు తివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.
addComments
Post a Comment