ముదిరిన టీటీడీ బోర్డు Vs ఎంప్లాయిస్ వివాదం..
క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ డిమాండ్!
తిరుపతి (ప్రజా అమరావతి): టీటీడీలో ఇప్పుడు మరో కొత్త వివాదం తెర మీదకు వచ్చింది. టీటీడీ పాలకమండలికి ఉద్యోగ సంఘాలకు మధ్య గ్యాప్ ఏర్పడింది. కొన్ని రోజులుగా ఈ వ్యవహారం అంతర్గతంగా నడుస్తున్నా ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. రెండు రోజుల క్రితం కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ అనే టీటీడీ పాలక మండలి సభ్యుడు ఆలయ మహా ద్వారం ముందు ఉన్న గేటు తీయకపోవడం ఇగోకు కారణమైంది.
గేటు వద్ద ఉన్న బాలాజీ అనే ఉద్యోగి గేటు తీసేందుకు అంగీకరించకపోవడంతో చిర్రెత్తిన బోర్డు సభ్యుడు అగ్రహంతో ఊగిపోయాడు. గేటు తాళం తీయని బాలాజీ అనే ఉద్యోగిని దూషించడం చర్చకు మారింది. పాలకమండలి సభ్యుడిగా సరైన గౌరవం తనకు దక్కలేదన్న అక్కసుతో నరేష్ కుమార్ దుర్భాషలాడడంపై టీటీడీ ఉద్యోగ సంఘాలు తప్పు పడుతున్నాయి.
మహాద్వారం వెలుపలకు వచ్చే మార్గం క్లోజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని ఈ మేరకు బోర్డు కూడా పెట్టారన్నారు. అయితే టీటీడీ ఉద్యోగి బాలాజీపై దురుసుగా ప్రవర్తించిన పాలక మండలి సభ్యుడు నరేష్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
గత 3 నెలలుగా టీటీడీ ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయని, ఈ మధ్యనే పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి కూడా సూరి అనే ఉద్యోగిని బదిలీ చేయించారన్నారు. పడి కావలి వద్ద ఉద్యోగిని ఇబ్బంది పెట్టారన్నారు. ఇలాంటి సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఉద్యోగ సంఘం నేతలు..
ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అంటున్నారు. ఇటీవల ఉద్యోగులపై అకారణంగా బదిలీవేటు వేసారని వారిని తిరిగి పునరుద్ధరించాలని టీటీడీ ఉద్యోగ సంఘం నేత వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ను కలుస్తామన్న టీటీడీ ఉద్యోగ సంఘం ప్రతినిధులు.. చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
addComments
Post a Comment