*జాతీయ విద్యావిధానం 2020 పై రెండురోజుల జాతీయ సదస్సు*
అమరావతి (ప్రజా అమరావతి);
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, సంస్కృత సంస్కృతి వికాస సంస్థాన్ న్యాస్, మధుర సంయుక్త తత్త్వావధానంలో జాతీయ నూతన విద్యావిధానం 2020 మరియు భారతీయ జ్ఞాన వ్యవస్థలపై ఏకీకరణ మరియు పునరుజ్జీవనం అనే అంశంపై రెండురోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవం ఈ రోజు విశ్వవిద్యాలయంలోని ప్రముఖ చెలికాని అన్నారావు సభాభవనం నందు జరిగినది.
ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా శ్రీలాల్ బహదూర్ శాస్త్రి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొ.మురళీ మనోహర్ పాఠక్ విచ్చేసి విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ మరియు విశిష్టాతిథులతో కలిసి జ్యోతిప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.
అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ నూతన విద్యావిధానం ఆధునిక భారతీయ అవసరతలకు మరియు ప్రాచీన భారతీయ జ్ఞానపరంపరకు ప్రతీకలు అని వివరించారు. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా భారతీయ విద్యావ్యవస్థలో సమూలమార్పులు తీసుకువచ్చి, ఉన్నత విద్యను భావితరాలకు అందించొచ్చని వివరించారు. వేద-పురాణ-ఇతిహాస-స్మృతి మొ గ్రంథాలలోని భారతీయ జ్ఞానాన్ని ఇందులో పొందుపర్చడం జరిగినది తెలియజేశారు. ఈ శిక్షానీతి భారతీయతకు నిదర్శనమని పునరుధ్ఘాటించారు.
తదనంతరం దర్బంగా విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొ.లక్ష్మినివాస్ పాండే మాట్లాడుతూ న్యూఎడ్యుకేషన్ పాలసీ భారతీయ జ్ఞానపరంపరకు ప్రతీకని వివరించారు. అనేక వైజ్ఞానిక మరియు భారతీయ తత్త్వవిషయాల కలయికని వివరించారు.
అనంతరం కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం భూతపూర్వ వైస్-చాన్సలర్ ప్రొ.పరమేశ్వరనారాయణ శాస్త్రి మాట్లాడుతూ భారతీయ జ్ఞాన వ్యవస్థలపై ఏకీకరణ మరియు పునరుజ్జీవనం నూతన విద్యావిధానంలో పొందుపర్చడం జరిగినది. ప్రత్యేకించి భూతపూర్వ ఎడ్యుకేషన్ విభాగం డీన్ ప్రొ.రవిశంకర్ మీనన్ గారి విద్యాసేవను వివరించడం జరిగినది.
అనంతరం శ్రీసోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం భూతపూర్వ వైస్-చాన్సలర్ ప్రొ.అర్కనాథ చౌధరీ మాట్లాడుతూ సాహిత్యం, సంగీతం మొ. అన్నీ కూడా నూతన విద్యావిధానంలో చక్కగా నిర్వచించడం జరిగినది. అన్ని భారతీయ విద్యలను ఏకీకృతం చేసిన శిక్షానీతి ఈ నూతన విద్యావిధానమని వివరించారు.
అనంతరం ఈ సదస్సు సమ్మానిత గ్రహీత భూతపూర్వ ఎడ్యుకేషన్ డీన్ ప్రొ.రవిశంకర మీనన్ (రిటైర్డ్) మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, అభివ్యక్తి మొ. లక్ష్యాలను అన్నీ మేళవించి ఈ నూతనవిద్యావిధానం నిర్మించడం జరిగినది. ఆధునిక భవిష్యత్తుకు అనుగుణంగా ఈ శిక్షానీతి ఎంతో చక్కగా నిర్వచించారని తెలియజేశారు.
అనంతరం కుంచికా భాషణం సంస్కృత సంవర్ధన ప్రతిష్ఠానం డైరెక్టర్, న్యూఢిల్లీ ప్రొ.చాన్ద్ కిరణ్ సలూజా మాట్లాడుతూ నూతన విద్యావిధానం 2020 నిర్మాణం అనేకవిషయాలను పరిశీలించి, అందులో ఉన్న గొప్పతనాన్ని పరిశీలించి నిర్మించడం జరిగినది. ఆధునికతరానికి అవసరమైన సర్వవిధజ్ఞానాన్ని ఎన్.ఇ.పి.2020లో నిరూపించడం జరిగినది.
అనంతరం కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఇన్చార్జి రిజిష్ట్రార్ ప్రొ.ఆర్.జి.మురళీ కృష్ణ మాట్లాడుతూ భారతీయ జ్ఞానాన్ని ఏకీకరణం, పునరుజ్జీవనం నూతన విద్యావిధానంలో పొందుపర్చడం జరిగింది. ఈ నూతన విద్యావిధానం ఆధునిక, ప్రాచీన జ్ఞానాన్ని ఏకీకరణం చేసి నిర్మించడం జరిగినది.
అనంతరం సభాధ్యక్షులు విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ ప్రొ.జి.యస్.ఆర్ క్రిష్ణమూర్తి మాట్లాడూతూ భారతీయ జ్ఞానమంతా సంస్కృత భాషలో నిక్షిప్తమయ్యిందని, ఆ జ్ఞానాన్ని బావితరాలకు అందించడానికి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ విశేషకృషి చేస్తుందని వివరించారు. నూతన విద్యావిధానంలో భారతీయతను చాటే విశేషమార్పులు తీసుకురావడం జరిగిందని వివరించారు. చక్కటి సదస్సును నిర్వహిస్తున్న ఆయోజకులను ఈ సందర్భంగా అభినందించడం జరిగినది.
అనంతరం భూతపూర్వ రిజిష్ట్రార్ మరియు ఎడ్యుకేషన్ డీన్ ప్రొ.రవిశంకర్ మీనన్ (రిటైర్డ్) ప్రత్యేక సన్మానం చేయడం జరిగినది. శిక్షాక్షేత్రంలో ఆయన చేసిన సేవలకు గాను మూడు సంస్థల ద్వారా సన్మాననం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంతటికి సభాసంచాలకులుగా ప్రొ.ఎ.సచ్చిదానంద మూర్తి వ్యవహరించి, ఆద్యంతం కార్యక్రమాన్ని చక్కగా నడిపించడం జరిగినది. చివరలో అందరికీ ధన్యవాదసమర్పణం విభాగాధ్యక్షురాలు ప్రొ.కె.కాదాంబిని చెయ్యడం జరిగినది.
ఈ కార్యక్రమానికి కో-ఆర్డినేటర్స్ గా ఎడ్యుకేషన్ విభాగం డీన్ ప్రొ.ఎన్.లతా, విభాగాధ్యక్షురాలు ప్రొ.కె.కాదాంబిని, స్టూడెంట్స్ వెల్పేర్ డీన్ ప్రొ.ఎస్.దక్షిణామూర్తి శర్మ, భూతపూర్వ రిజిష్ట్రార్ ప్రొ.ఆర్.జి.త్రిపాఠి మరియు అడిషనల్ కో-ఆర్డినేటర్స్ ప్రొ.సచ్చిదానంద మూర్తి, ప్రొ.మధుకేశ్వర భట్, ప్రొ.కాన్త భాటియా, డా.ఎ.చారుకేశ్ వ్యవహరించి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విభిన్న విశ్వవిద్యాలయ అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్స్ పాల్గొనడం జరిగినది.
addComments
Post a Comment