గత వైసీపీ పాలకులు మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు.

 


*గత వైసీపీ పాలకులు మహిళల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు


*

*వైసీపీ పాలనలో మహిళలపై నేరాలు ఘోరాల్లో ఏపీ ముందంజలో ఉంది*

*పెళ్లికానుక, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్, బడికొస్తా వంటి అనేక పథకాలను రద్దు చేశారు*

*సున్నా వడ్డీని కుదించి డ్వాక్రా మహిళలను మోసం చేశారు*

*ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పారిశ్రామిక ప్రోత్సాహాన్ని ఎగ్గొట్టారు*

*గత వైసీపీ పాలనంతా దోచుకోవడం దాచుకోవడమే.. మహిళల కోసం* చేసింది ఏమీ లేదు*

*మాజీ మంత్రి పీతల సుజాత*  

  అమరావతి (ప్రజా అమరావతి);

వైసీపీ నేతలు గత పాలనలో మహిళలు ఉన్నారన్న సంగతే మరచి మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా నేడు కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మహిళా బడ్జెట్ పై విమర్శలు చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి పీతల సుజాత మండిపడ్డారు. అనేక మహిళా పథకాలను రద్దు చేయడమే కాకుండా.. నాడు మహిళలపై ఎన్నో నేరాలు ఘోరాలు జరిగినా జగన్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె  మాట్లాడారు. 


*పీతల  సుజాత మాట్లాడుతూ..*


రూ. 3,22,359 కోట్ల తో ప్రవేశ పెట్టిన ఏపీ బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుంది. మహిళా శక్తిని గుర్తించి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ లో కేటాయింపులు చేయడం హర్షణీయం. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా  అన్ని రంగాల్లో రాణించేలా చంద్రబాబు నిత్యం ఆలోచిస్తుంటారు. చంద్రబాబు మహిళా పక్షపాతి.. వారి మేలుకోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహిళా శిశు సంక్షేమానికి రూ.4,332 కోట్లు బడ్జెట్ లో కేటాయించడంపై  మహిళలందరి తరఫున ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్న. మొదటి నుండి మహిళలకు చంద్రబాబు, ఆయన ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు తమ సత్తా చాటగలరని గుర్తించి మొట్టమొదటి సారి పురుషులతో  సమానంగా ఆస్తిలో వాటకల్పించి ఆన్న నందమూరి తారకరామారావు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారు. దాన్ని కొనసాగిస్తూ.. మహిళలకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేలా.. మహిళలు వారి కాళ్లమీద వారు నిలబడేలా డ్వాక్రా గ్రూపులను తీసుకు వచ్చి చేదోడును అందించిన ఘనత చంద్రబాబుది. 


మహిళల పేరుమీద ఇళ్ల పట్టాలు ఇవ్వడం, మహిళలకు కండెక్టర్ జాబులు ఇవ్వడం, మహిళల పేరుమీద ప్రభుత్వ కార్డులు ఇవ్వడం వంటి గొప్ప నిర్ణయాలు తీసుకుని మహిళలకు సరైన గుర్తింపునిచ్చారు చంద్రబాబు. ఈ బడ్జెట్  మహిళా సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది. కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది... మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. గత వైసీపీ పాలన అంతా దోచుకోవడం దాచుకోవడమే. తల్లిని చెల్లిని కూడా గెంటేసిన వ్యక్తికి బయటి మహిళలను అక్కా చెల్లి అంటూ పిలిచే అర్హత ఎక్కడిది?. ఉచిత ఇళ్ల పేరుతో మహిళలను మోసం చేశారు. ఓటీఎస్ అంటూ పదివేల నుండి రూ. 30 వేల వరకు దండుకున్నారు.  సెంటు పట్టా పేరుతో పేదలను వంచించారు. టీడీపీ పాలనలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్వీర్యం చేశారు. టీడీపీ పాలనలో అమలైన పెళ్లి కానుకను రద్దు చేశారు. అంగన్ వాడీలకు జీతాలు పెంచకుండా ఇబ్బంది పెట్టారు. గంజాయి, డ్రగ్స్, నాసిరకం మద్యం అమ్మకాలతో దోపీడీకి తెరలేపారు.. మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదు. సున్నా వడ్డీని ఐదు లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచుతామని డంబాలు పలికిన జగన్ రెడ్డి దాన్ని మూడు లక్షలకు కుదించాడు. ఆ వడ్డీని కూడా ఆయన కట్టలేదు కేంద్రమే భరించింది. జగన్ రెడ్డి డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా.. డ్వాక్రా మహిళలు దాచుకున్న అభయహస్తం నిధులు రూ.2100 కోట్లను దారి మళ్లించి డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారు. మళ్లీ వీళ్లకు డ్వాక్రా మహిళల గురించి మాట్లాడే అర్హత ఉందా? 



అమ్మఒడి రూ. 13 వేలు ఇచ్చి నాన్న బుడ్డితో దాదాపు రూ. 70 వేలు దండుకున్నారు. మహిళలను పారిశ్రామికంగా ప్రోత్సహిస్తామని చెప్పి.. ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. బాలికలకు బడికొస్తా పథకంలో భాగంగా అమలు చేసిన సైకిళ్ల పంపిణీని పక్కన పెట్టారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసవించిన తల్లిబిడ్డను సురక్షితంగా ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్  సేవలు ‘’తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్’’ను రద్దు చేశారు. గిరిజన ప్రాంతాల్లో మహిళల కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్ లను ఆపేశారు. గిరిజన గర్బిణీల కోసం ఏర్పాటు చేసిన వసతీ గృహాలను మూసేశారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ లను అటకెక్కించారు. పండుగలకు పేదలకు ఇచ్చే రంజన్ ,క్రిస్మస్, సంక్రాంతి  కానుకలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసి పేదల కడపు కొట్టారు. దిశా పేరుతో డ్రామాలు ఆడారే తప్పా.. జగన్ పాలనలో ఆడబిడ్డకు రక్షణగా నిలిచే ఒక్క రక్షణ వ్యవస్థ కూడా లేదు.  మహిళలకు రక్షణ లేకుండా వైసీపీ పాలనలో చట్టాలను నిర్వీర్యం చేశారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక చట్టాలను పటిష్టంగా అమలు చేస్తున్నాం. మహిళల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుంది.


వైసీపీ ప్రభుత్వంలో నిర్వీర్యమైన డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకు వచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. జగన్ పాలనలో కుదించిన సున్నా వడ్డీ పరిమితి మూడు లక్షల నుండి మళ్లీ దాన్ని ఐదు లక్షలకు పెంచుతున్నాం. ఒక్కో సభ్యురాలికి 50 వేల నుండి లక్ష వరకు వడ్డీ లేని రుణాలను అందిస్తున్నాం. వడ్డీ రాయితీ రుణాలను త్వరలో పది లక్షల వరకు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిదేందుకు వారికి పెట్టి బడి రాయితీని 35% నుండి 40% పెంచాం. ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్ వాడీలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ చెల్లించేందుకు బడ్జెట్లో  రూ. 60 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయం. గత ఐదేళ్ల పాలనలో అక్రమాలు అవినీతే.. అందుకే ప్రజలు సరైన గుణపాఠం చెప్పి పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు మంచి మెజార్టీ ఇచ్చారు. వారి ఆశలు ఆశయాలను నెరవేరుస్తూ.. ఒక్కొక్క హామీలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. స్కూల్స్ ఒపెన్ చేసిన వెంటనే తల్లికి వందనం అమలు చేస్తాం. తల్లికి వందనంపై వైసీపీ పేటీఎం బ్యాచ్ దారుణంగా ట్రోల్ చేశారు. అర్హత ఉంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ కు కూడా15 వేలు ఇస్తాం. ఇది ప్రజల ప్రభుత్వం.. ప్రజా పాలన నడుస్తుంది.. ప్రజలందరూ సంతోషంగా ఉండటమే మాలక్ష్యం.

Comments