అమరావతి మార్చి 7, (ప్రజా అమరావతి);
సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (C.M.R.F) చెక్కులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు.
శుక్రవారం, అమరావతి సచివాలయంలోని మంత్రి కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మొత్తం రూ. 1,42,059/- విలువైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ప్రజలకు అత్యవసర ఆరోగ్య సాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ముందుండి పనిచేస్తుందని, ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
addComments
Post a Comment