విజయవాడ (ప్రజా అమరావతి);
విధ్యాధరపురం జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి విలువైన పరికరం
సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R) చొరవతో ఉచితంగా ఏర్పాటు
అందుబాటులో సుమారు రూ. 15 లక్షలు విలువైన ఎయిర్ బ్రేక్ BS-VI మోడల్ పరికరం
అందజేసిన చెన్నై కంపెనీ
ప్రారంభించిన ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R)
APSRTC వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, I. P. S. (R) వారి చొరవతో ZF CVCS India Ltd., Chennai వారి ద్వారా సుమారు రూ. 15 లక్షల AIR BRAKE DBS BS-VI WORKING MODEL పరికరాన్ని APSRTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, విధ్యాధరపురం, విజయవాడ ఉచితంగా పొందగలిగింది.
ఈ రోజు APSRTC జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ, విధ్యాధరపురం, విజయవాడ లో ZF CVCS India Ltd., Chennai వారి DBS BS-VI WORKING MODEL పరికర ప్రారంభోత్సవ కార్యక్రమం ఆర్టీసీ ఎండీ శ్రీ Ch. ద్వారకా తిరుమల రావు, I. P. S. (R) గారి చేతుల మీదుగా జరిగింది.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరికరం ద్వారా డ్రైవర్లు మరియు మెకానిక్ లకు బస్సుల బ్రేక్ సిస్టం పై మెరుగైన అవగాహన కల్పించటానికి మరియు వారి యొక్క పనితీరు మెరుగుపరచటం కోసం ఉపయోగపడుతుంద
ని ఆయన తెలిపారు.
బ్రేక్ సిస్టం పై కార్మికులకు అవగాహన మరియు పనితనం పెంపొందించుటం వలన బస్సు బ్రేక్ డౌన్లు, అలాగే యాక్సిడెంట్లు తగ్గుటానికి ఈ పరికరం ఎంతగానో దోహదపడుతుందని ఆయన తెలియజేశారు.
ఈ కార్య క్రమానికి ZF CVCS India Ltd., Chennai సంస్థ నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీ S.P. సాంబశివరావు మరియు ఏరియా మేనేజర్ శ్రీ N. సుమన్, APSRTC సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ శ్రీ Ch. రవివర్మ, ED(Admin.), శ్రీ T. చెంగల్ రెడ్డి, ED(E), శ్రీ G. విజయరత్నం, ED(Zone-2), మరియు శ్రీమతి V. నీలిమ, ప్రిన్సిపాల్/ZSTC, సంస్థ సిబ్బంది హాజరైరయ్యారు.
addComments
Post a Comment