మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘనలకు క్రొత్త అపరాధ రుసుము అమలు.


  గుంటూరు (ప్రజా అమరావతి);

గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్  inspector శ్రీ. ఏ అశోక్ కుమార్  మార్చి ఒకటవ తారీఖు నుండి కొత్తగా అమలవుతున్న ట్రాఫిక్ చలానాల అవగాహన గురించి ప్రజలకు పత్రికా ప్రకటన ద్వారా తెలియపరచడం జరిగింది .

రాష్ట్రవ్యాప్తంగా మార్చి ఒకటవ తారీఖు నుండినుండి మోటార్ వెహికల్ చట్టం ఉల్లంఘనలకు క్రొత్త అపరాధ రుసుము అమలు


లోకి వచ్చినందున వాహనదారులందరూ తెలుసుకోవలసిందిగా తెలియపరచడమైనది. వాహన దారులందరూ తమ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లను సక్రమంగా ఉంచుకొనవలెను, వాహనాలను నడిపేటప్పుడు వాహన చట్టం ఉల్లంఘనకు  పాల్పడరాదు , ఎవరైనా  వాహన చట్ట  ఉల్లంఘనకు పాల్పడిన యెడల వారిపై కొత్తగా అమలులోకి వచ్చిన చలానాలను విధించబడును కావున ప్రజలందరూ కొత్తగా వచ్చిన చలానాలపై అవగాహన కల్పించుకొని, వాహనదారులందరూ సక్రమంగా వాహన డాక్యుమెంట్లను ఉంచుకోవడం మరియు వాహన  చట్టం రూల్స్ ను  పాటించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

Comments