టీమిండియా ఘన విజయం! ఇక ఆసీస్‌తో సెమీస్ సమరానికి సై..
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు న్యూజిలాండ్‌పై అద్భుతమైన విజయం సాధించింది.
టాప్ ఆర్డర్ కుప్పకూలినప్పటికీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల భాగస్వామ్యం, పాండ్యా అద్భుత ఇన్నింగ్స్ భారత జట్టును 249 పరుగులకు చేర్చింది.
మంగళవారం సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది భారత్. న్యూజిలాండ్ తరఫున కేన్ విలియమ్సన్ ఒక్కడే 81 పరుగుల పోరాడినా.. టీమిండియా బౌలర్లు మిగతా అందర్నీ చుట్టేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది.
ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా.. 30 పరుగులకే టాపార్డర్ కుప్పకూలిన భారత జట్టు కోలుకొని నిలబడిన తీరు అద్భుతమనే చెప్పాలి.
శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ 4వ వికెట్‌కు జోడించిన 98 పరుగుల పార్ట్నర్‌షిప్‌తో పాటు, చివర్లో పాండ్యా ఆడిన 45 పరుగుల ఇన్నింగ్స్ టీమిండియాకు మంచి స్కోర్ ఇచ్చింది.
ఇక ఈ విజయంతో టీమిండియా మంగళవారం(మార్చ్ 4న) తొలి సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఢీ కొట్ట నుంది.
ఆస్ట్రేలియాను సెమీస్‌లోనే ఓడించేస్తే ఇక ఫైనల్‌లో టీమిండియా కూల్‌గా ఆడి కప్పు కొట్టడం ఖాయమని క్రికెట్ అభిమానులు కూడా భావిస్తున్నారు.
addComments
Post a Comment