ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండినది.

 విజయవాడ (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండినది.


కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టు అండర్ టేకింగ్స్ (ఏఎస్అర్ టియు) ఏటా అందించే ప్రతిష్ఠాత్మక “నేషనల్ బస్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు”, 2023-24  సంవత్సరానికి గాను ఏకంగా నాలుగింటిని ఎపిఎస్ ఆర్ టిసి సొంతంచేసుకున్నది .


1. టెక్నాలజీ  ఇనీషియేటివ్   2.  అత్యధిక కె యం పి యల్ 3. అత్యధిక టికెటేతర ఆదాయము 4. తక్కువ ఆక్సిడెంట్ రేట్, విభాగాలలో  ఈ పురస్కారాలు దక్కినవి. ఈ నెల 08 న న్యూడిల్లీలో జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎపిఎస్ ఆర్ టిసి సంస్థ తరుపున మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ద్వారకా తిరుమల రావు IPS గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (జోన్-II)  శ్రీ జి.విజయరత్నం గారు, మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్(IT) శ్రీ వై.శ్రీనివాసరావు గార్లు, కార్యక్రమ ముఖ్య అతిది డా. శ్రీమతి  కిరణ్ బేడీ గారి నుండి ఈ నాలుగు  అవార్డులు అందుకున్నారు.


జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ద్వారకా తిరుమలరావు గారు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కూడ ఎపిఎస్ ఆర్ టిసి  అనేక అవార్డులను గెలుచుకోవటం జరిగినది.


సిబ్బంది నిబద్ధత , అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని సంస్థ ఎండీ తెలిపారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ముఖ్య మంత్రివర్యులు  గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రగతిశీల నాయకత్వంలో  ఎపిఎస్ ఆర్ టిసి మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 


Comments