*"ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం"*
*ఘనంగా ముగిసిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం
*
అమరావతి (ప్రజా అమరావతి);
ఆధునిక భారతం లో యువత పాత్ర కీలకం అని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అన్నారు మ భారత ప్రభుత్వము, కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ, నెహ్రూ యువ కేంద్ర, విజయవాడ ఆధ్వర్యంలో బుధవారం నుండి నుంచి 5 రోజుల పాటు జరిగిన అంతరాష్ట్రీయ యువ సమ్మేళనం కార్యక్రమం సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ మెకానికల్ సెమినార్ హాల్ లొ ఘనంగా ముగిసింది
ఈ కార్యక్రమం లో కేరళ లోని 6 జిల్లాలైన కన్నూర్, కోజికోడ్, కాసర్గడ్, అల్ పూజ, మరియు త్రిసూర్, కొల్లాం, జిల్లా లో నుంచి మెత్తం 27 మంది యువతి యువకులు హాజరైయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరై న సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంకటేశ్వరరావు వారు కేరళ నుంచి వచ్చిన యువతి యువకుల ముఖాముఖిలో వారి అనుభవాలను తెలుసుకున్నారు అనంతరం మాట్లాడుతూ వివిధ రాష్ట్రాలు & కేంద్రపాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు మరియు అభ్యాసాల పరిజ్ఞానం మరియు రాష్ట్రాల మధ్య మెరుగైన అవగాహన పెరగటానికి సహాయపడుతుంది అని అన్నారు. ఈ సమ్మేళనం లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలియజేసారు.
సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ ఏవి రత్న ప్రసాద్ మాట్లాడుతూ ఈ సమ్మేళనం లో భాగమైన వివిధ అంశాలపై కార్యశాలలు, క్షేత్ర స్థాయి సందర్శనల ద్వారా కేరళ యువతకు జాతీయ ఐక్యత, సమగ్రత, శాంతి ప్రతిపాదకులుగా యువతి యువకులు వ్యవహరించేలా చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కేరళ యువతకు ఇక్కడ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్లు తో సహా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గురించి యువ సమ్మేళనంలో తెలియజేసే అవకాశం దొరికింది అని అన్నారు.
ఎన్టీఆర్ నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువ అధికారి సుంకర రాము మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ కు మరియు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఎన్ ఎస్ ఎస్ విభాగ వాలంటీర్లకు ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి విక్టర్ బాబు, డిస్టిక్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కొల్లేటి రమేష్, లక్కిరెడ్డి బాల్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ బి శివ హరి ప్రసాద్ ప్రసాద్ అతిధులుగా హాజరై ప్రసంసింగించగా సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదంగా జరిగింది. కేరళ నుంచి హాజరైన ప్రతి ఒక్కరికి పార్టిసిపంట్ సర్టిఫికెట్స్ అందజేశారు.
addComments
Post a Comment