ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఖరీఫ్, రబీ రెండు సీజన్లకు రూ.12,000 కోట్ల నగదు రైతు ఖాతాల్లో జమ
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్
కొల్లిపర (ప్రజా అమరావతి);
పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన రాజకీయ, అధికారిక కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులతో కలిసి మంత్రి నాదెండ్ల గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే సమస్యలపై అవగాహన కలుగుతుందన్నారు.ఈ సందర్భంగా మంత్రి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను వ్యక్తిగతంగా అడిగి తెలుసుకున్నారు.
"ఇది నా ఊరు... ఇది నా బాధ్యత" అంటూ, ప్రతి సమస్యను శ్రద్ధగా విని, పరిష్కారం కోసం తగిన సూచనలు చేశారు. సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కొల్లిపర మండలానికి చెందిన సిమ్లా నాయక్, దేవి బాయ్ దంపతులు మంత్రిని కలిసి తమకు నూతన రైస్ కార్డు మంజూరు చేయాలని మంత్రిని కోరగా.. సానుకూలంగా స్పందించిన మంత్రి AAY కార్డు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు... అంతేకాకుండా అప్పటికప్పుడు 35 కేజీల బియ్యాన్ని అందజేశారు...
గతంలో స్పీకర్ గా 2004 నుంచి 2014 తను పనిచేసిన కాలంలో సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేసిన సందర్భాన్ని ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
అప్పట్లో ప్రజా సమస్యలను 21 రోజులు కాదు 18 రోజుల్లోనే సమస్యను పరిష్కరించిన సందర్భాలను గుర్తు చేశారు. అదేవిధంగా ప్రజల ఇంటి వద్దకు అధికారులు వచ్చి వ్యవసాయ యంత్రాలు, ఇళ్ల పట్టాలు, గృహ రుణాలు, పింఛన్లు అనేక సమస్యలకు పరిష్కారం చేసి చూపించిన విషయాన్ని వివరించారు.
దాదాపు 10 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనేక సంస్కరణ తీసుకొచ్చారన్నారు.
కొల్లిపర మండలంలో రెవెన్యూ విభాగం అధికారులతో మాట్లాడినప్పుడు ల్యాండ్ సర్వే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు... వారం రోజులలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
అదే విధంగా గృహ నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ వచ్చే నెలలోపే పొజిషన్ సర్టిఫికెట్లు(పిసి లు) జారీ చేస్తామని తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతాల్లో డొంక రోడ్ల విస్తరణ సమస్య ఉందని... ఈ సంవత్సరం ఈ వేసవి కాలంలో ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడే విధంగా 10 కోట్ల రూపాయలతో డొంక రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని తెలియజేశారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి జరగాలన్నారు.
కొల్లిపర మండలంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు... అదేవిధంగా పారిశుద్ధ్యం, రహదారులపై ఆక్రమణ విషయంలో పౌరులు బాధ్యత తీసుకోవాలన్నారు.. గత పది సంవత్సరాల కిందట ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పైప్ లైన్లు మరమ్మత్తులను చేయించి ఇంటి ఇంటికి మంచినీరు అందిస్తామన్నారు. భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు.. నియోజవర్గంలో గంజాయి పై ఉక్కుపాదం మోపాలని, కఠిన చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు..దేశంలో మొట్టమొదటిసారిగా రైతుకు మద్దతు ధర ఇవ్వాలని ఖరీఫ్, రబీ రెండూ సీజన్లు కలిపి రైతు ఖాతాలో 12 వేల కోట్ల రూపాయల నగదు జమ చేయడం జరిగిందన్నారు.
*ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అపూర్వ స్పందన-213 ఆర్జీలు స్వీకరించిన మంత్రి*
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. పెద్ద ఎత్తున బాధితులు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు.. ఉదయం నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా దాదాపు 213 ఆర్జీలను మంత్రి స్వీకరించారు... ప్రతి ఒక్కరి సమస్యను శ్రద్ధగా పరిశీలించిన మంత్రి, వారం రోజుల్లోపు వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా,ఈ కార్యక్రమంలో డిపిఓ నాగసాయి కుమార్, డిఇఓ సివి రేణుక, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వేకంటేశ్వర్లు, తెనాలి వ్యవసాయ శాఖ ఏడి ఉషారాణి , తెనాలి డిఎస్పీ జనార్ధన రావు, కొల్లిపర సర్పంచ్ పిల్లి రాధిక, తహసీల్దార్ సిద్ధార్థ , ఎంపీపీ భీమవరపు పద్మావతి, ఎంపీడీవో విజయలక్ష్మి , వెటర్నరీ అధికారి సాయి సతీష్ రాజు , వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. భరత్ , ఎలక్ట్రికల్ ఏఈ ప్రదీప్ కుమార్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వంగా సాంబి రెడ్డి , బీసీ నాయకులు అద్దంకి వేణుగోపాల్ గౌడ్ , జనసేన నాయకులు కట్టా. శ్రీహరి రెడ్డి, అడపా నారాయణ రెడ్డి , భీమవరపు కిషోర్ రెడ్డి , మండల , జిల్లాకు సంబందించిన వివిధ శాఖాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment