గుంటూరు, 19 మే 2025 (ప్రజా అమరావతి):- జిల్లాలోని హౌసింగ్ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణాలు ప్రతి వారం నిర్దేశించిన లక్ష్యాలు అథిగమించేలా హౌసింగ్ అధికారులను సమన్వయం చేసుకొని ఎంపీడీవో లు , మున్సిపల్ కమిషనర్లు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లోని సంయుక్త కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ హౌసింగ్ ఇళ్ళ లే అవుట్లలో ఇళ్ళ నిర్మాణం, రైస్ కార్డు , ఉపాధి హామీ పథకం పనులపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ మాట్లాడుతూ హౌసింగ్ లే అవుట్లలో ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణాల పురోగతి లేద
ని, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ద తీసుకొని హౌసింగ్ ఏఈ లను సమన్వయం చేసుకొని సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎమినిటీస్ సెక్రటరీల ద్వారా ప్రతిరోజు పర్యవేక్షించాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇనుము అందుబాటులో ఉందని, ఇసుక సైతం సంబంధిత లే అవుట్లోను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. లే అవుట్లలో అప్రోచ్ రోడ్లు లేనందున రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలన్నారు. రూఫ్ లెవల్ లో వున్నంటువంటి ఇళ్ళ నిర్మాణాల స్టేజ్ అప్డేషన్ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. లబ్దిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఋణాలు మంజూరు చేయించి గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూఫ్ లెవల్ లో ఉన్న ఇళ్ళను లబ్ధిదారులు తక్షణమే పూర్తి చేసుకోనేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలకు ప్రతివారం నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయటంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద లేబర్ సమీకరణ లక్ష్యాలను సక్రమంగా పూర్తి చేయాలన్నారు. ఇండివిడ్యువల్ పామ్ పాండ్స్ , పిట్స్ టార్గెట్ ను పూర్తి చేయాలన్నారు. ఈ రోజు అనుమతి ఇచ్చిన వారిని వెంటనే గ్రౌండింగ్ చేయించాలన్నారు. ఏ మండలంలో కూడా జీరో ఉండడానికి వెల్లేదన్నారు. రైస్ కార్డు ఏడు రకాల సర్వీసులు ప్రొవైడర్స్ ఇస్తున్నాయి. కొన్ని కేటగిరిలలో వచ్చిన 11,446 సర్వీసెస్ రిక్వెస్ట్ లను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఏమైనా కొత్త విషయాలను నోట్ చేసిన వారు అందరికి షేర్ చేయాలని తహశీల్దార్లకు సూచించారు. ఏపి సేవా సర్వీసెస్ పై అందరు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డి ఆర్ ఓ ఎన్.ఎస్.కే. ఖాజావలి , పీడీ హౌసింగ్ ప్రసాద్, స్టెఫ్ సిఇఓ ఆర్. చంద్ర ముని , పీడీ ఐసీడీఎస్ విజయలక్ష్మీ, పీడీ డ్వామా వి శంకర్, సిపిఓ శేషశ్రీ , జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జయలక్ష్మీ పాల్గొన్నారు.
addComments
Post a Comment