*ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి స్వాగతం పలికిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్.
*భావితరాల భవిష్యత్తు అమరావతి రాజధాని
*
*డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే ఆంధ్రుల కలల రాజధానికి మళ్లీ జీవం*
అమరావతి (ప్రజా అమరావతి ): అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకి శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అమరావతి లోని హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఘన స్వాగతం పలికారు.
అమరావతి రాజధాని నిర్మాణానికి, రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్నందుకు పీఎం నరేంద్రమోదీకి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అమరావతి రాజధాని భావితరాల భవిష్యత్తుగా తయారు కానుందని ఒక ప్రకటనలో పేర్కొన్నరు. గత ప్రభుత్వ దుర్మార్గ పాలన వల్ల ఆగి పోయిన రాజధాని నిర్మాణ పనులకి డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మళ్లీ జీవం వచ్చిందన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కల సాకారం కానుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గ్లోబల్సిటీగా అమరావతి అవతరించనుందని పేర్కొన్నారు.
addComments
Post a Comment