*ఉన్నత చదువుతో ఉజ్వల భవిష్యత్తు
*
*-ఫజీలతుష్షేక్ అష్రఫ్ ఫైజీ*
*- ఘనంగా మదర్సా ఆయిషా సిద్ధిఖీ 12వ వార్షికోత్సవం*
మంగళగిరి (ప్రజా అమరావతి):
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఫజీలతుష్షేక్ అష్రఫ్ ఫైజీ హఫిజహుల్లాహ్ అన్నారు. నగరంలోని ఈద్గా షాదీఖానాలో ఆదివారం
మదర్సా ఆయిషా సిద్ధిఖీ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫజీలతుష్షేక్ అష్రఫ్ ఫైజీ హఫిజహుల్లాహ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 12 సంవత్సరాలుగా మదర్సా నిర్వహిస్తున్న నిర్వాహకులు ఎంతైనా అభినందనీయులని కొనియాడారు. విద్యార్థినులు కూడా క్రమశిక్షణతో చదువుకుని చక్కని ప్రతిభ కనబర్చుతుండటం హర్షణీయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే ప్రాపంచిక విద్యతో పాటు ధార్మిక విద్య ను కూడా అభ్యసించేలా తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా ఆలిమ్ కోర్సు పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థినులకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో మదర్సా ప్రిన్సిపాల్ అబ్ధుల్ అలీమ్ జామయీ, అన్వరీ ఇస్లామిక్ సెంటర్ అధ్యక్షులు జనాబ్ మొహమ్మద్ జహంగీర్ హాది సాహెబ్, మదర్సా కమిటీ సభ్యులు ఎస్.ఏ సిలార్, షబ్బార్, ఖదీర్, సంధానీ, రఫీ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment