జూనియర్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చావలి సునీల్!.
జూనియర్ అసిస్టెంట్ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చావలి సునీల్!



మంగళగిరి (ప్రజా అమరావతి );


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ. చావలి సునీల్ గారి చాంబర్లో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వేళాంగిణి యొక్క సోదరి మానసిక పరిస్థితి బాగోలేక పోవడం అలాగే ఇటీవల ఆమె బావ కూడా చనిపోవడం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో సహ ఉద్యోగి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ చావలి సునీల్ కి సమాచారం రావడంతో వెంటనే ఆ కుటుంబానికి పిల్లల చదువుల కోసం 25,000 వేల రూపాయలు నగదును ఆర్థిక సాయం అందించారు. అలాగే భవిష్యత్తులో ఆ పిల్లల చదువుల పై అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన స్టాఫ్ కూడా ఉన్నారు.
Comments