అమరావతి (ప్రజా అమరావతి);
అన్న NTR విగ్రహానికి పూల మాలలు వేసి దీపాలు వెలిగించి మహానాడు వేడుకలు జర్మనీ దేశం లో ఘనం గా మొదలు అయ్యాయి.ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి అభినందనలు మరియు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారి సందేశం వినిపించారు.
తీర్మానాల్లో బాగంగా పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించి,చంద్రబాబు గారి P4 మీద ఆంధ్ర రాష్ట్రానికి చేయూత ,కూటమి విజయం పై హర్షం,జర్మనీ మరియు చుట్టు పక్కల దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి ఆపద సమయంలో అందుబాటులో ఉంటామని తీర్మానాలు ప్రవేశ పెట్టారు.ముఖ్య అతిధులుగా పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ ప్రవాస భారతీయుల స్ఫూర్తి ,సుమారు 12 లక్షలు మంది ఎన్నికల సమయంలో స్వదేశానికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర లో పార్టీ కి ప్రచారం చేసి రాష్ట్ర పునర్నిర్మాణానికి కంకణం కట్టిన వారికి అభినందనలు తెలియచేశారు. గుంటూరు AMC పూర్వ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలుగుదేశం ,NTR నేపద్యం, చంద్రన్న దూర దృష్టి, లోకేష్ గారి యువ నాయకత్వం మీద మాట్లాడారు.
పవన్ కుర్రా,శ్రీకాంత్ కుదిటిపూడి,నరేష్ కోనేరు,వంశీ దాసరి, తిట్టు మద్దిపట్ల, సుమంత్ కొర్రపాటి,వెంకట కంద్ర,మరియు శివ నిర్వహణలో జర్మనీ మహానాడు జరిగింది.చిన్నారుల సాంప్రదాయ నృత్యాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం హుషారుగా సాగింది.అతిధుల సత్కారం తో కార్యక్రమం ముగిసింది.
addComments
Post a Comment