అన్ని Brain stroke లను ఒకే లాగా చూడకండి.

గుంటూరు (ప్రజా అమరావతి);


మా సంస్థ రెండు ముఖ్యమైన సూత్రాలను బలంగా ప్రచారం చేస్తోంది:
“అన్ని Brain stroke లను ఒకే లాగా చూడకండి

” మరియు “Time is Brain”.
మా లక్ష్యం ఏంటంటే, మెజారిటీ స్ట్రోక్ కేసులలో సమీపంలోని స్ట్రోక్ రెడీ హాస్పిటల్స్‌లో అత్యవసర టెస్టులు మరియు చికిత్స జరగాలి. చికిత్స మరియు సాంకేతికతలో పురోగతి ఉన్నప్పటికీ, సమాజంలో ఒక సాధారణ అపోహ కొనసాగుతోంది:
“బ్రెయిన్ స్ట్రోక్ అనేది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది.”
అయినప్పటికీ, ఒక సాధారణ CT స్కాన్‌తో ద్వారా హీమరాజిక్ మరియు ఇస్కెమిక్ స్ట్రోక్‌లను స్పష్టంగా వేరు చేయవచ్చు. ఈ వేరు చెయ్యటం చాలా కీలకం, ఎందుకంటే ఈ రెండు రకాల స్ట్రోక్‌లకు చికిత్స విధానాలు భిన్నంగా ఉంటాయి.
ఇస్కెమిక్ స్ట్రోక్‌గా నిర్ధారణ అయిన వెంటనే, దాని తీవ్రతను అంచనా వేయడం మరియు థ్రాంబోలిసిస్‌ (బ్లాకేజ్ కరిగించే మందు) కు అనుకూలతను నిర్ణయించడం అవసరం. లక్షణాలు ప్రారంభమైన 4.5 గంటలలోపు థ్రాంబోలిసిస్ ఇవ్వడం ద్వారా రోగి యొక్క పక్షవాతం శాశ్వతం అవ్వకుండా ఆపవచ్చు.
థ్రాంబెక్టమీ (రక్తనాళాల్లో బ్లాకేజ్ ని ఆంజియోగ్రామ్ ద్వారా ఒక సూక్ష్మమైన కాథెటర్ తో తొలగించటం) అవసరాన్ని CT నెక్ మరియు బ్రెయిన్ యాంజియోగ్రఫీ ఆధారంగా నిర్ణయించాలి. పెద్ద రక్త నాళం ఏదైనా బ్లాక్ అయితే 6 గంటల వరకు కూడా త్రొఎంబెక్టమీ చికిత్స చెయ్యవచ్చు అని కొత్త అంతర్జాతియ్య గైడ్లైన్స్ చెప్తున్నాయి.
స్ట్రోక్ రకాన్ని గుర్తించడం ద్వారా, భవిష్యత్తులో మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఎం జాగర్తలు తీసుకోవాలో, ఎం చికిత్సలు చెయ్యాలో తెలుస్తుంది.
మా OPDలలో మేము మార్చగలిగే మరియు మార్చలేని రిస్క్ ఫ్యాక్టర్ల ప్రాముఖ్యతను చెప్తున్నాము, ఇవి గుండె మరియు మెదడు స్ట్రోక్‌లపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. స్ట్రోక్ లో ప్రతి ఒక్క నిమిషం విలువైనది. అందుచేత ప్రజలలో కొత్త రకమైన వైద్య విధానాల గురించి అవగాహన పెంచడం ముఖ్యం.
మేము కిమ్స్ శిఖరలో 24 గంటల అత్యవసర మరియు క్రిటికల్ కేర్ టీమ్‌ను మరియు న్యూరో టీమ్‌ను కలిగి ఉన్నాము. అందువల్ల అక్యూట్ న్యూరోలాజికల్ ఎమర్జెన్సీలను సమర్థంగా నిర్వర్తించగలం. మా హాస్పిటల్లో అత్యాధునిక CT మరియు MRI ఉండడం వలన స్ట్రోక్‌ లో అత్యంత విలువైన సమయాన్ని కాపాడవచ్చు.
 
కేస్ స్టడీ:
45 సంవత్సరాల రోగి, షుగర్ మరియు బీపీ సమస్యలతో బాధపడుతూ, ఆటో డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి, 19/05/2025 మధ్యాహ్నం 12 గంటలకు  ఒక్కసారిగా ఎడమ చేయి మరియు ఎడమ కాలు పూర్తిగా పడిపోయి పక్షవాత బాధితులు అయ్యారు.
ఆయన సాయంత్రం 5:30 కి మా హాస్పిటల్‌కు చేరుకున్నారు. మేము చెకప్ చేసినప్పుడు, మెదడుకు రక్త సరఫరా చేసే ముఖ్యమైన ఆర్టరీస్‌లో ఒకటి బ్లాక్ అయ్యిందని గుర్తించాం.
మా న్యూరో సైన్సెస్ టీమ్ (డా. ప్రదీప్ రెడ్డి - న్యూరాలజీ, డా. లక్ష్మణ్ - న్యూరో సర్జరీ, డా. వివేక్ లంకా – న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ) వెంటనే రోగిని స్టేబిలైజ్ చేసి, “మెకానికల్ థ్రాంబెక్టమీ” అనే చికిత్సను చేశారు. తక్కువ సమయంలోనే బ్లాక్ అయిన రక్తనాళాన్ని తెరిచి, మెదడు కుడి వైపుకు రక్త సరఫరాను పునరుద్ధరించారు.
తర్వాత రోజు నుంచే రోగి బలహీనత అద్భుతంగా కోలుకోవడం ప్రారంభించాడు. తను రెండు చేతులు, కాళ్లు కదిలించడం మొదలుపెట్టాడు. రిహాబిలిటేషన్ టీమ్ అతని కి  వెంటనే ఫిజియోథెరపీ చేయడం ప్రారంభించింది, మరియు వారం రోజులలోపే అతను దాదాపుగా మామూలు మనిషి అయ్యారు. ఇంకొన్ని వారాల్లో పూర్తిగా కోలుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
10 సంవత్సరాల క్రితం ఇలాంటి బ్రెయిన్ స్ట్రోక్స్ / అకస్మాత్తుగా వచ్చే పక్షవాతానికి చికిత్స చేయడం అసాధ్యంగా భావించేవారు. అటువంటి రోగులు కొంత మెరుగుదల చూపించినా, జీవితాంతం మంచానికే పరిమితమవుతారు. కానీ ఈ రోజు, కొత్త సాంకేతిక జ్ఞానంతో, పెద్ద నష్టాన్ని నివారించగలుగుతున్నాం, కొత్త జీవితం ఇవ్వగలుగుతున్నాం.
ఈ కథలోని నీతి ఏమిటంటే:
బ్రెయిన్ స్ట్రోక్స్‌ నుంచి కోలుకునే అవకాశం ఉంది – కావాల్సిందల్లా సరైన సమయంలో సరైన ఆసుపత్రికి చేరుకోవడం మాత్రమే.
బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యవసర పరిస్థితి – ఇది హార్ట్ అటాక్‌కు తక్కువేమీ కాదు. శాశ్వత నష్టం జరిగే ముందు చికిత్స మొదలుపెడితే, ఫలితాలు చాలా బాగుంటాయి.
Comments