కడపలో మహానాడు వాయిదా వేయాలని విజ్ఞప్తి జాయింట్ కలెక్టర్‌ను కలిసిన వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు
కడప, మే 24 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో మరియు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ పి. రవీంద్రనాథ్ రెడ్డి , మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్.బి. అంజాద్ బాషా ఈరోజు కడప కలెక్టరేట్‌కి వెళ్లి జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఐఏఎస్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున జరిగే సభలు, సమావేశాలు ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రమాదకరమవుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ మహానాడు సందర్భంగా కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవాలని కోరిన నాయకులు, ప్రభుత్వం కూడా కరోనా మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, మాజీ టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య, మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పోలీసు అనిల్ కుమార్, కార్పొరేటర్లు పాకా సురేష్, మహమ్మద్ షఫీ, బాలస్వామి రెడ్డి, శ్రీరంజన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, నాయకులు వినోద్ కుమార్, నిరంజన్ రెడ్డి, రఘునాథ రెడ్డి, షఫీ, తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment