కాంగ్రెస్ ప్రభుత్వంలో జోడెడ్లలా సంక్షేమం, అభివృద్ధి
హైదరాబాద్ (ప్రజా అమరావతి);
కాంగ్రెస్ హయాంలో సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లల పాలన సాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ ప్రతి గ్రామం, మండలంలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. తిరుమలాయపాలెం కూసుమంచి మండలాల్లో శనివారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
తిరుమలాయపాలెం మండలం రాకాసి తండా నుండి మన్నెగూడెం వరకు 3.75 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, 27 కోట్ల అంచనా వ్యయంతో పాతర్లపాడు క్రాస్ రోడ్ నుండి రావి చెట్టు తండా రోడ్డు వరకు రెండు వరుసల రహదారి, మహ్మదాపురంలో బోడతండ నుండి సుబ్లేడు, మేడిదపల్లి రోడ్డు నుండి భవాని గుడి వరకు 3.15 కోట్లతో బిటి రోడ్డు, తెట్టెలపాడు గ్రామంలో ఏడు అంతర్గత సిసి రోడ్లు, గోపాలపురం నుండి జల్లేపల్లి వరకు 38 కోట్ల రూపాయిలతో రెండు వరసల రహదారి పనులు, చిన్న పోచారం నుండి కిష్టాపురం తాళ్ళచెరువు జెడ్పి రోడ్డు వరకు 2.80 కోట్లతో బిటి రోడ్డు నిర్మాణ పనులకు, వీటితోపాటు జీళ్ళచెరువు గ్రామంలో సూర్యాపేట- అశ్వరావుపేట రోడ్డు నందు 50 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయడం జరిగింది.
రైతులు, నిరుద్యోగులు, మహిళలు, గ్రామీణ నిరుపేదలకు ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందించాను.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment