*అవమానించిన చోటనుంచే జైత్రయాత్ర చేశారు!*
*ఉత్తరాంధ్ర సైకిల్ యాత్రికులకు లోకేష్ అభినందన*
కడప:(ప్రజా అమరావతి )అవమానించిన చోటే సైకిల్ పై జైత్రయాత్ర చేసిన మీలాంటి పసుపు సైనికులే మాకు స్పూర్తి, ప్రతిపక్షంలో ఉండగా అధినేతకు అండగా మీలాంటి వారు అందించిన సంఘీభావంవల్లే గత ఎన్నికల్లో విజయఢంకా మోగించామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను అభినందించారు. గత ప్రభుత్వంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు సంఘీభావంగా 2023 అక్టోబర్ 2న ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన నిద్రవెంగి రామకృష్ణ, చిల్లా రామసూరి, నిద్రవెంగి ఆదినారాయణ, బోయ పెంటారెడ్డి, ఎన్. సుందర్ రావు, సరగడ రమేష్ అనే కార్యకర్తలు ఎచ్చెర్ల నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర ప్రారంభించారు. సైకిల్ యాత్ర పుంగనూరు నియోజకవర్గం సుదాలమెట్టకు చేరుకున్న సమయంలో 2023 అక్టోబర్ 20న వైసిపికి చెందిన చెంగలాపు సూరి, మరికొందరు అతడి అనుచరులు టిడిపి కార్యకర్తలను చొక్కాలు విప్పించి తీవ్రంగా అవమానించి అడ్డుకున్నారు. ఆనాటి వైసిపి నాయకుల ఆ అరాచక పర్వం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమై సోషల్ మీడియాలో వైరల్ అయింది అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే యాత్ర నిలిపివేశారో అక్కడి నుంచి ఆ ఆరుగురు టిడిపి కార్యకర్తలు సోమవారం సైకిల్ పై జైత్రయాత్ర ప్రారంభించి కడప మహానాడుకు చేరుకున్నారు. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు నేతృత్వంలో ఆ కార్యకర్తలు మంగళవారం సాయంత్రం కడప మహానాడు ప్రాంగణంలో యువనేత నారా లోకేష్ ను కలిశారు. ఈ సందర్భంగా యువనేత లోకేష్ వారిని అభినందిస్తూ... అరాచకపాలనపై మీవంటి వారు ధైర్యంగా గళమెత్తడం వల్లే గత ఎన్నికల్లో వైసిపికి ప్రజలు బుద్దిచెప్పారని అన్నారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని యువనేత లోకేష్ భరోసా ఇచ్చారు. లోకేషన్న ఇచ్చిన భరోసా తమకు కొండంత ధైర్యాన్నిచ్చిందని, భవిష్యత్తులో పార్టీకోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తామని సైకిల్ యాత్రీకులు సంతోషం వ్యక్తంచేశారు.
addComments
Post a Comment