కొత్త సిటీ ఆర్డినరీ బస్సును పరిశీలించిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R).

 కొత్త సిటీ ఆర్డినరీ బస్సును పరిశీలించిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.(R)


విద్యాధరపురం జోనల్ వర్క్ షాప్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న నూతన బస్సు బాడీ 

అధికారులను, సిబ్బందిని అభినందించిన ఎం.డి. 

నిర్మాణ నివేదిక కోరిన ఎం.డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు,              ఐ. పి. ఎస్.(R)

    అమరావతి (ప్రజా అమరావతి);

జోనల్ వర్క్ షాప్, విజయవాడ వారి ఆధ్వర్యంలో సర్వీసబుల్ ఛాసిస్ మీద ప్రయోగాత్మకంగా తయారు చేసిన కొత్త సిటీ ఆర్డినరీ బస్సు బాడీని ఆర్టీసీ హౌస్ ప్రధాన కార్యాలయం వద్ద, సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సిహెచ్.  ద్వారకా తిరుమల రావు, I.P.S. (R) పరిశీలించారు. 

ఈ కొత్త సిటీ బస్సుని ఎం.డి. గారి  పరిశీలన నిమిత్తం  ఆర్టీసీ హౌస్ కి తీసుకురాగా సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్.  ద్వారకా తిరుమల రావు, I.P.S. (R) బస్సుని క్షుణ్ణంగా పరిశీలించారు. 

కొత్త బస్సు బాడీకి వాడిన మెటీరీయల్, పెయింటింగ్, సీట్ల నాణ్యత, తయారు చేయడానికి అయిన ఖర్చు తదితర వివరాలు సంబందిత అధికారులని అడిగి తెలుసుకున్నారు. 


ప్రయాణికులు కూర్చునే సీట్లు, కిటికీలు, మెట్లు దిగేందుకు, ఎక్కేందుకు  అణువుగా ఉన్నవో, లేదో మరియు టైర్ల నాణ్యత, బస్సు పెయింటింగ్, తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ కొత్త బస్ బాడీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వర్క్స్ మేనేజర్, అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసు కున్నారు. 

ఇదే విధంగా రాష్ట్రంలోని మిగిలిన జోన్ల పరిధిలో గల వర్క్ షాప్ లలో బస్ బాడీలు నిర్మించడానికి కావలసిన వనరులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక నివేదిక ఇవ్వవలసిందిగా అధికారులను ఆదేశించారు. అనంతరం బస్సు నిర్మాణంలో భాగస్వాములైన ఉద్యోగులను, సిబ్బందిని, సూపర్వైజర్లను, వర్క్స్ మేనేజర్ ను ప్రత్యేకంగా అభినందించారు.       

ఈ పరిశీలనలో  ఎం.డి. గారితో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ శ్రీ జి. వి.  రవివర్మ (అడ్మిన్),  శ్రీ ఏ. అప్పలరాజు (ఆపరేషన్స్), విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్                            శ్రీ జి. విజయరత్నం, NTR జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీ ఎం. వై. దానం, మరియు ఛీఫ్ మెకానికల్ ఇంజినీర్ (ఎం) శ్రీ జి. నాగేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Comments