SLBC మరియు బ్యాంక్ ప్రతినిధులకు MLCC మాడ్యుల్స్ మరియు మెప్మా పధకాలపై TOT ట్రైనింగ్.

 SLBC మరియు బ్యాంక్ ప్రతినిధులకు  MLCC మాడ్యుల్స్ మరియు మెప్మా పధకాలపై TOT ట్రైనింగ్



తాడేపల్లి (ప్రజా అమరావతి ):  

 రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు,   పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ  పర్యవేక్షణలో  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  శ్రీ ఎస్. సురేష్ కుమార్ IAS  ఆధ్వర్యంలో మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ. N. తేజ్ భరత్, IAS, MEPMA ప్రవేశపెట్టిన MLCC మాడ్యుల్స్ మరియు మెప్మా పధకాలపై SLBC మరియు బ్యాంక్ ప్రతినిధులతో ఈరోజు మెప్మా ప్రధాన కార్యాలయం తాడేపల్లి నందు TOT ట్రైనింగ్ నిర్వహించడం జరిగినది.

ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎస్. సురేష్ కుమార్ IAS  మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్రం లో మెప్మా పరిధిలో పట్టణ ప్రాంతాలలో ఉన్న స్వయం సహాయక సంఘాల సమగ్ర సమాచారాన్ని SHG ప్రొఫైలింగ్ APP ద్వార 28,39,046 (99.41%) అనగా 2,74,873 గ్రూప్ లు డేటా బేస్ సిద్దం చేయుట జరింగింది.  ఈ డేటా ను బ్యాంకులకు అనుసందానం చేయుట ద్వారా ఋణమంజూరు సమయంలో నిశిత పరిశీలనకు దోహద పడుతుంది. ఇందుకోసం మెప్మా లోన్ చార్జి క్రియేషన్ మాడ్యుల్ (MLCC) రూపొందిచుట జరిగినది. ఈ డేటా బేస్ అనుసందానం చేయుట ద్వారా గ్రూపు లోని సభ్యుల వివరాలు, వారి ఆధార్ నంబర్ పై ఉన్న ఇతర ఋణాల వెరిఫికేషన్ తెలుసుకోవటం సులబతరమవుతుంది అని తెలియచేసారు. 

MEPMA SHG ప్రొఫైలింగ్‌ను పూర్తిచేసింది మరియు SHG లావాదేవీలను డిజిటలైజ్ చేయడానికి మహిళాకాశం, MEPMA లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) మాడ్యూల్ వంటి డిజిటల్ కార్యక్రమాలను ప్రవేశపెట్టినది.

మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ. N. తేజ్ భరత్, IAS,  మాట్లాడుతూ లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) మాడ్యూల్ APP ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ యాప్ నందు ఈ మైక్రో క్రెడిట్ ప్లాన్ ద్వారా లోన్ ఎలా ఇవ్వాలి, జూన్ 1 వ తేదీ నుండి అర్బన్ ప్రాంతాలలో సంఘ సభ్యులకు బ్యాంకు ఋణాలు ఈ యాప్ ద్వారానే మంజూరు చేయాలని, ఫిజికల్ గా లోన్ ఇవ్వటానికి లేదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 24 బ్యాంకులలో 2631 బ్రాంచీలకు గాను 2066 లాగిన్ లను ఇచ్చాము. వీటి ద్వారా  SHGలకు లోన్ ఇవ్వాలని ఈ ట్రైనింగ్ నందు తెలిపారు. ఈ యాప్ ద్వారా లోన్ ఇవ్వటం వల్ల ఏ రకమైన మిస్ యూజ్ కాకుండా, లోన్ అమౌంట్ కట్టకపోవటం లాంటివి లేకుండా ఈ  లోన్ ఛార్జ్ క్రియేషన్ (MLCC) మాడ్యూల్ APP ఉపయోగపడుతుందని బ్యాంక్ ప్రతినిధులకు తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాలలో 30,000 మంది మహిళా పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేయాలి. అందులో అంతకుముందు నుంచే వ్యాపారం చేస్తున్న 10 వేల మంది మహిళలకు మరింత శిక్షణ ఇప్పించి అత్తుత్తమ వ్యాపారవేత్తలుగా మరియు 20 వేల మంది మహిళలను కొత్త వ్యాపార వేత్తలుగా అభివృద్ధి చేయాలి అని మెప్మా మిషన్ డైరెక్టర్  బ్యాంకు ప్రతినిదులను కోరారు.

కొన్ని బ్యాంకు శాఖలు అంతర్గత రుణాల (Internal Lending) కోసం తమ పొదుపు డబ్బును తీసుకోవడానికి SHGలకు అనుమతించకపోతున్నట్లు మాకు తెలియజేయబడింది. అంతర్గత రుణాల నిర్వహణ SHGల ప్రాథమిక నియమాల్లో ఒకటి, అంటే పంచసూత్రాలలో ఒకటి. అందువల్ల అన్ని బ్యాంకులను SHG గ్రూప్ లకు అంతర్గత రుణాల కోసం డబ్బు ఉపసంహరించడానికి అనుమతించమని వినమ్రంగా అభ్యర్థిస్తున్నాం.

మెప్మా ప్రవేశపెడుతున్న కొత్త కార్యక్రమాలు (New Initiatives):

రాపిడో (RAPIDO)

తృప్తి హోటల్స్ (Trupti Hotels)

ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (FFC)

స్మార్ట్ వీధి (Smart Street)

మొబైల్ మార్ట్స్ (Mobile Marts)

పర్యాటక ఆధారిత జీవనోపాధి (Tourism based Livelihoods)

గ్రీన్ ఇనిషియేటివ్స్ జీవనోపాధి (Green Initiatives Livelihoods)

పై జీవనోపాధి కార్యక్రమాలకు వ్యక్తిగత SHG సభ్యులు లేదా SHG సభ్యుల గ్రూప్ ఆధారంగా బ్యాంకులు సహకరించాలని కోరుతున్నాము.

ఈ రోజు మెప్మా ప్రధాన కార్యాలయం తాడేపల్లి నందు జరిగిన ఈ కార్యక్రమం లో  పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  శ్రీ ఎస్. సురేష్ కుమార్ IAS , మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ. N. తేజ్ భరత్ IAS , APTIDCO MD శ్రీ బి. సునిల్ కుమార్ రెడ్డి IFS , SLBC మరియు బ్యాంక్ ప్రతినిధులు, మెప్మా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Comments