వైయస్ఆర్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా తరలివచ్చిన యువత.

 వైయస్ఆర్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి  1500 మందికి పైగా తరలివచ్చిన యువత




 జెండా ఊపి యువత పోరు.. కార్యక్రమాన్ని ప్రారంభించిన.. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.


యువత సమస్యల పై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున. 


నెల్లూరు ఓల్డ్ జడ్పీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు.. యువతకు ప్రభుత్వం చేస్తున్న.. అన్యాయాలను.. ఎండగడుతూ సాగిన ర్యాలీ


యువత పోరు విజయవంతం కావడంతో.. హర్షం వ్యక్తం చేస్తున్న యువత.


నెల్లూరు (ప్రజా అమరావతి);


     నెల్లూరు వైయస్ఆర్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి 1500 మందికి పైగా యువత భారీగా తరలివచ్చారు.


ఈ కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరై.. యువజన పోరు ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సందర్బంగా .. ప్రభుత్వం యువతకు చేస్తున్న అన్యాయాలను.. నినదీస్తూ..యువత ప్లకార్డులు  చేత పట్టుకొని ర్యాలీ నిర్వహించారు


ర్యాలీలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, ఊటుకూరు నాగార్జున వినూత్న రీతిలో.. రిక్షా తొక్కుతూ.. యువత పడుతున్న ఇబ్బందుల పై.. నిరసన తెలియజేశారు.


ఓల్డ్ జడ్పీ కార్యాలయం నుంచి.. కలెక్టరేట్ వరకు.. యువత, నిరుద్యోగుల ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో.. ర్యాలీ హోరెత్తింది.


అనంతరం కలెక్టరేట్ వద్దకు..చేరుకొని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున, వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ లు.. DRO భాస్కర్ రావు గారికి.. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై  మెమోరాండం అందజేసి.. యువత, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు.


నిరుద్యోగ భృతి పేరుతో  చంద్రబాబు యువతను దగా చేశారని.. వైయస్ఆర్ సీపీరాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ అన్నారు.


రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నప్పటికీ.. చంద్రబాబు చేత తల్లికి వందనం అమలు చేయించిన ఘనత వైయస్ఆర్ సీపీ యువజన విభాగానిదేనన్నారు. రాబోయే రోజుల్లో  కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువత కు నిరుద్యోగ భృతి కూడా అందే విధంగా వైయస్ఆర్ సీపీ పోరాటం చేస్తుందని తెలిపారు.


ఈరోజు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. యువత పోరు కార్యక్రమాన్ని జిల్లాలో దిగ్విజయంగా  నిర్వహించామని వైసీపీ విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రిత్ రెడ్డి అన్నారు. ఈరోజు చంద్రబాబు చేస్తున్న అన్యాయాలకు.. యువతతో పాటు విద్యార్థులు కూడా ఎంతో నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. విడుదల చేయకపోవడంతో..  చదువు పూర్తి చేసుకొన్న విద్యార్థులు కళాశాలల నుంచి.. సర్టిఫికెట్లు తీసుకోలేక.. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.


యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కార్పోరేటర్ 

ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ..


ఈరోజు జిల్లాలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. నెల్లూరు సిటీ వైసీపీ ఇంచార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో జిల్లాలో పెద్ద ఎత్తున  యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.

వైయస్ఆర్ సీపీ ఇచ్చిన ఒక్క పిలుపుతో.. జిల్లా నలుమూలల నుంచి యువత ఉప్పెనలా యువత పోరు కార్యక్రమానికి తరలి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే .. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు యువతను మభ్యపెట్టి.. ఓట్లు వేయించుకొని..ఈ రోజు వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తవుతున్నప్పటికీ.. యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదని అన్నారు. అధికారంలోకి రాగానే యువతకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు.. కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఈరోజు ఆ హామీలన్నీ మరచి.. అధికారంలోకి రాగానే  యువతను వెన్నుపోటు పొడిచారని అన్నారు. చంద్రబాబు నాయుడి జీవితం అబద్దాల పుట్ట అని అన్నారు.

ఇటీవల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు దుర్మార్గపు పాలనపై పుస్తకం విడుదల చేయడం జరిగిందని.. అదే చంద్రబాబు జీవితంలో ఇప్పటివరకు చేసిన తప్పులను లెక్కిస్తూ పుస్తకాలను రచిస్తే.. అబద్ధాలు చంద్రన్న మోసాలు అని ఊరికో లైబ్రరీ పెట్టాల్సి వస్తుందన్నారు. రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లకు.. అబద్ధపు హామీలు..ఇచ్చి మోసం చేశారని.. అలాగే ఏడాదికి ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువతను చంద్రబాబు మోసం చేశారని తెలిపారు. మరోపక్క రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతుంటే.. చంద్రబాబు జబర్దస్త్ స్కిట్లతో ఎంజాయ్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై  హత్యలు,మానభంగాలు పెచ్చు మీరిపోయాయని.. వాటిని నిలువరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈరోజు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి నిలువునా మోసపోయామని ప్రజలు గ్రహించి..మళ్ళీ ఈ రాష్ట్రంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనను తెచ్చుకోవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని.. యువతకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని.. లేదంటే భవిష్యత్తులో వైయస్ఆర్ సీపీ మరింత ఉధృతంగా పోరుబాట సాగిస్తుందని హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Comments