ఖరీఫ్ 2025 నుండి వ్యవసాయ శాఖ పూర్తి డిజిటలైజేషన్.



*ఖరీఫ్ 2025 నుండి వ్యవసాయ శాఖ పూర్తి డిజిటలైజేషన్


*

— డిల్లీ రావు, ఐఏఎస్, వ్యవసాయ సంచాలకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

అమరావతి (ప్రజా అమరావతి);

ఇథియోపియాకు చెందిన అగ్రికల్చర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇన్‌స్టిట్యూట్ (ATI) ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ చేపట్టిన ఆధునిక డిజిటల్ పథకాల అధ్యయనం నిమిత్తం రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యంగా APAIMS 2.0 (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్) అమలుపై వారు అవగాహన పొందారు.


ఈ బృందం రాష్ట్ర RTGS కేంద్రాన్ని సందర్శించి, ఇన్‌పుట్ పంపిణీ నుండి ఈ-మార్కెట్ ప్లేస్ సమన్వయం వరకు జరిగే పూర్తి స్థాయి డిజిటల్ సేవల వ్యవస్థపై వివరాలను తెలుసుకున్నారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మషీన్ లెర్నింగ్ (ML) వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు.


ఈథియోపియా బృందానికి డిజిటల్ అగ్రికల్చర్ & ఫైనాన్స్ ప్రోగ్రాం డైరెక్టర్ శ్రీ గిరుమ్ కెటెమా టెక్లెమరియం నేతృత్వం వహించగా, మొత్తం 10 మంది సీనియర్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. వీరి పర్యటనను వ్యవసాయ శాఖ నుండి శ్రీ బాలసుబ్రహ్మణ్యం, సూపరిండెంట్ ఇంజనీర్ మరియు కన్సల్టెంట్ శ్రీ ఎన్.డి.ఆర్.కె. శర్మ సమన్వయపరచారు.


ముందు సచివాలయంలో

 ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయ, సహకారం) బి. రాజశేఖర్, ఐఏఎస్ తో సమావేశమయ్యారు  APAIMS 2.0 అమలులో పారదర్శకత, ఆపరేషనల్ సామర్థ్యం, వ్యవసాయ సేవల సరళత ఎలా మెరుగవుతుందో డిల్లీ రావు, ఐఏఎస్  వివరణ ఇచ్చారు. ఖరీఫ్ 2025 నుండీ శాఖా కార్యకలాపాలు పూర్తిగా APAIMS 2.0 ప్లాట్‌ఫామ్‌ ద్వారానే జరగనున్నాయని, ఇకపై ఎలాంటి మానవీయ లేదా ఆఫ్‌లైన్ ప్రక్రియలు అనుమతించబోవని తెలిపారు. ఈ వ్యవస్థను వాసర్ ల్యాబ్స్ ఐటీ సొల్యూషన్స్, హైదరాబాద్ అభివృద్ధి చేసింది.


రెండు రోజుల కార్యక్రమములో  భాగంగా నిన్న  ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం APCNF PMDS రైతు పొలాల సందర్శన చేయడం 

 ప్రకృతి వ్యవసాయం పద్ధతులపై రైతులతో  సంభాషణ జరిపారు.


ఇథియోపియా ATI బృంద సభ్యుల వివరాలు:


క్రమసంఖ్య పేరు పదవి


1 గిరుమ్ కెటెమా టెక్లెమరియం డైరెక్టర్ – డిజిటల్ అగ్రికల్చర్ & ఫైనాన్స్ ప్రోగ్రాం (బృందనాయకులు)

2 హాబ్తాము హైలమరియం గెమెచు సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్

3 ఎజెడిన్ అబ్దెలా మహమ్మద్ సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్

4 నెగెరి నెగస్సా గెర్బా సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్

5 కెరగా అలెము గెమెచు సీనియర్ అనలిస్ట్

6 సామువెల్ కిబ్రెట్ షిఫెరా అనలిస్ట్

7 వెయెస్సా గారెడ్ టెరెఫె ప్రాజెక్ట్ టీం లీడ్

8 యోసెఫ్ మెకాషా గెబ్రె డైరెక్టర్ – లైవ్‌స్టాక్ కమర్షియలైజేషన్ ప్రోగ్రాం

9 హైలే దెరెస్సా సెన్బెటా డైరెక్టర్ – ADEY ప్రోగ్రాం

10 అవేకె ములాలెమ్ గెలా డైరెక్టర్ – నేచురల్ రిసోర్సెస్ & క్లైమేట్ ప్రోగ్రాం

( ఇంగ్లీష్ లో వారి పేర్లను ప్రత్యేకముగా పెట్టడం జరుగుతుంది )


 డైరెక్టర్ డిల్లీ రావు, ఐఏఎస్  మాట్లాడుతూ : APAIMS 1.0 వ్యవసాయ ఉత్పత్తి, దిగుబడి, స్థూల విలువ (GVA) వంటి సమగ్ర డేటాపై దృష్టి సారించగా, APAIMS 2.0 రైతు కేంద్రిత విధానం, ప్లాట్ వారీగా కీటకాలు/రోగాల హెచ్చరికలు, సలహాలు, మరియు రైతులపై ఆధారపడి ఉన్న వర్క్‌ఫ్లోల సమన్వయం వంటి అంశాలపై దృష్టి పెట్టినట్లు వివరించారు.


ఇథియోపియా బృందం రాష్ట్ర డిజిటలైజేషన్ చొరవలపై హర్షం వ్యక్తం చేసింది. బృందనాయకుడు శ్రీ గిరుమ్ రాష్ట్రంలోని సమగ్ర డిజిటల్ వ్యవసాయ వ్యవస్థను అభినందిస్తూ, ఇలాంటి విధానాన్ని తమ దేశంలో కూడా అమలు చేయాలన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు.


అంతిమంగా డైరెక్టర్ డిల్లీ రావు  శ్రీ గిరుమ్ ని శాలువాతో సత్కరించారు.


Comments