*వెన్నుపోటుకు జగన్ బ్రాండ్ అంబాసిడర్*
*-కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఘనుడు జగన్*
*-ఆస్తులు లాక్కుని బయటకు గెంటివేసి తల్లికి, చెల్లెలికి వెన్నుపోటు*
*-శవ రాజకీయాలు వైసీపీ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య*
*-స్కామ్ లు బయటకు వస్తున్న తరుణంలో వెన్నుపోటు దినంగా ప్రకటించడం హాస్యాస్పదం*
*- రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ లక్షల కోట్లు గడించి పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఘనుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, స్కామ్ లు బయటకు వస్తున్న తరుణంలో తప్పించుకునేందుకు వెన్నుపోటు దినంగా ప్రకటించడం హాస్యాస్పదమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ... వైసీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఆ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, వైసీపీ పార్టీకి కొన ఊపిరి కూడా లేకుండా చేసిన రాష్ట్ర ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ మోహన్ రెడ్డి అని , అందులో ఎటువంటి సందేహమే లేదన్నారు. జగన్ చేసిన లక్షల కోట్ల అవినీతి కారణంగా ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని, వెన్నుపోటు దారుడిగా జగన్ దేశంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాడని విమర్శించారు. వైఎస్ అవినాష్ రెడ్డికి ఎంపీ సీటు ఇవ్వడం కోసం సొంత బాబాయి ని గొడ్డలితో అంతమొందించిన చరిత్ర జగన్ రెడ్డి ది కాదా? అని ప్రశ్నించారు. తల్లిని, చెల్లిని ఎన్నికల్లో వాడుకొని అధికారంలోకి రాగానే వారికి వెన్నుపోటు పొడిచాడని, చెల్లెలి ఆస్తుల్ని సైతం లాక్కొని బయటకు గెంటివేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బ్యానర్లు ముద్రించడం పై రామచంద్రపురం లో ఫిర్యాదు ఇవ్వడం జరిగిందన్నారు. కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా డైవర్స్ పాలిటిక్స్ కు తెరలేపుతూ బ్యానర్లు ఏర్పాటు చేయడం సరికాదని, ఇందుకు 504,505 సెక్షన్లు వర్తిస్తాయని గుర్తు చేశారు. నా బీసీలు, నా ఎస్సీలు అని మాటిమాటికి ప్రస్తావించే జగన్ రెడ్డి సప్లై నిధులను పూర్తిగా మళ్లించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 26 ప్రభుత్వ పథకాలు తీసివేసి బడుగు, బలహీన వర్గాల పాలిట వెన్నుపోటు దారుడిగా చరిత్రలోకి ఎక్కింది జగన్ రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. మద్యాన్ని రాష్ట్రం నుంచి పారద్రోలతామని హామీ ఇచ్చిన జగన్ కల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి వారి ప్రాణాలతో ఆడుకున్నాడని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా కమీషన్ల కోసం కంపెనీలను రాష్ట్రం నుంచి గెంటివేసిన చరిత్ర జగన్ దే నన్నారు. రాష్ట్రంలో కులాల మధ్య, పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి జగన్ చలిమంట కాచుకుంటున్నాడని విమర్శించారు. గడచిన 11 నెలల కాలంలో రూ.8 లక్షల కోట్లు పెట్టబడులు తీసుకువచ్చామని, రానున్న రెండేళ్లలో ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. రూ. 1200కోట్లతో రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి సుభాష్ తెలిపారు. ఈ సమావేశంలో అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పాల్గొన్నారు.
addComments
Post a Comment