వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖిలా వరంగల్ మైదానంలో అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వరంగల్ (ప్రజా అమరావతి);
జూన్ 2, రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా వరంగల్ జిల్లా కేంద్రంలోని ఖుష్ మహల్, ఖిలా వరంగల్ ప్రాంగణంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది.
ముందుగా ఖిలా వరంగల్ మధ్యకోటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఖిలా వరంగల్ మైదానంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయజెండాను ఆవిష్కరించి, పోలీసు అధికారులు నిర్వహించిన పెరేడ్ లో పాల్గోని గౌరవ వందనం స్వీకరించడం జరిగింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం, జిల్లా ప్రగతిని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో అమరులైన వారి కుటుంబాలను సత్కరించడం జరిగింది, భాదాతప్త హృదయంతో అమర వీరుల కుటుంబ సభ్యులు వారిని గుర్తు చేసుకుని చలించి పోతే వారిని ఓదార్చి పరామర్శించడం జరిగింది, ప్రభుత్వం వారికి అండగా ఉంటదని చెప్పడం జరిగింది. వరంగల్ జిల్లా అధికారులు పట్టణ అభివృద్ధి, పథకాలపైన తయారు చేసిన శకటాలు, ఏర్పాటు చేసిన స్టాల్స్ లను సందర్శించడం జరిగింది. వేదిక దగ్గర రైతులకు విత్తనాలను అందించడం జరిగింది, తెలంగాణ సంస్కృతి, దేశభక్తి ఉట్టిపడేలా విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి వారిని అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య గారు, శ్రీపాల్ రెడ్డి గారు, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, కె ఆర్ నాగరాజ్ గారు, జిల్లా కలెక్టరు, పోలీసు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,అన్ని శాఖల జిల్లా అధికారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment