శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే అరాచక పార్టీ వైసీపీ - ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.



శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే అరాచక పార్టీ వైసీపీ - ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.



 అమరావతి (ప్రజా అమరావతి);

         శవాల మీద రాజకీయ పబ్బం గడుపుకునే ఆరాచక పార్టీ వైసీపీ అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘జగన్ మోహన్ రెడ్డి పరామర్శలు, పర్యటనలు ఎందుకు చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితిలో మిగిలిపోతున్నాయి. మనిషి ఎంతోకొంత జ్ఞానంతో జీవనం సాగిస్తారు.. ప్రజలతో ఉన్నాం.. రాజకీయాల్లో ఉన్నాం.. ప్రజల పక్షాన ఉన్నాం.. అని అనుకునే కొన్ని ఆంశాల్లో జగన్ మోహన్ రెడ్డి కొన్ని సుత్రాలు పట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రాధామిక అంశాలకు కూడా పరిమితం కాకుండా.. మానవత్వానికి అర్థం లేకుండా జీవిస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనేమోనని అనిపిస్తుంది. తెనాలి.. పొదిలి.. సత్తెనపల్లి ప్రాంతాల్లో జగన్ మోహన్ రెడ్డి పర్యలనలు చేశారు.. ఎందుకు చేశారో వారికి వారే ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ‘‘కిరాయి రౌడీలను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు..’’ తెనాలి పర్యటనకు వచ్చిన తరువాత అ ప్రాంత ప్రజల మాట. గత ఐదేళ్ల పాలనలో జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించారనే దానికి ఇది నిదర్శనం. వారు చేసిన విధ్వంసం, అవినీతి, ఆరాచకం పాలనకు నేడు ప్రతిపక్షం లేకపోయిన ప్రతిపక్ష నాయకుడిగా మీరు చేసిన దానికి తెనాలి పర్యటనలు నిదర్శనం. పోలీసుల అనుమతులకు విరుద్ధంగా కొన్ని వేల మందితో దౌర్జన్యంగా పోలీసులు నియమ నిబంధనలకు పక్కన పెట్టేశారు. చట్టం మీద, న్యాయం మీద జగన్ మోహన్ రెడ్డికి నమ్మకం లేదా..? జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ ఉన్న కారు కింద పడి మనిషి చనిపోయాడు. ఎప్పుడో ఏడాది కిందట వైసీపీ కార్యకర్త బెట్టింగ్‌లో డబ్బులు పొగొట్టుకుని చనిపోతే.. ఆయనకు విగ్రహావిష్కరణలు చేశారు. వెళ్లే దారిలో మీ కారు కింద మనిషి పడి చనిపోయినప్పుడు కనీసం పట్టించుకోకుండా, అతన్ని పక్కకు లాగేసి ముందుకు సాగిన మీకు మానవత్వం గురించి అర్హత లేదు. దీని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే విగ్రహావిష్కరణ చేసిన వ్యక్తి మాత్రమే వైసీపీ కార్యకర్త అయినట్లు.. కారు ప్రమాదంలో మరణించిన వ్యక్తి వైసీపీ కార్యకర్త కానట్లు ప్రవర్తించారు. మీరు ప్రజానాయకుడిగా అనుకుంటే కనీసం ప్రమాదానికి గురైన వ్యక్తిని వెంటనే అసుపత్రికి తరలించే పని చేయాలి. నా వల్ల ప్రమాదం జరిగింది కాబట్టి నేను ఆగి పరామర్శించాలి.. తగిన సాయం అందించాలని.. బతకటానికి అవకాశం ఉంటే బతికించాలనే ఈ సమాజంలో జగన్ మోహన్ రెడ్డి నేను నాయకుడిని అని చెప్పుకునే దుర్మర్గమైన విధానంతో జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్న తీరు నిదర్శనంగా నిలుస్తుంది. జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఉన్మాడిలాగా ఏ రకంగా అయితే ప్రవర్తించారో.. అదే విధంగా నేడు కూడా ప్రతిపక్షంలో ఉండి.. ప్రజాభివృద్ధి కోసం, ప్రజల సౌక్యం కోసం, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తే వాటిని ఎట్టి చూపేందుకు ఆలోచన చేయాలి కానీ, పరామర్శల పేరుతో మీరు చేస్తున్న అకృత్యాలు, అన్యాయాలు ఎవరు చేయాలేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో సంక్షేమం - అభివృద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న నేపధ్యంలో అందుకు తగ్గట్టు ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి.. జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల కాలంలో పోలవారాన్ని, అమరావతిని నాశనం చేశారు. పరిశ్రమలు రాకుండా పారద్రోలేవిధంగా ప్రవర్తించారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి.. అతలాకుతలం చేశారు. జగన్ రెడ్డి పాలనను చూసి 5 కోట్ల మంది అంధ్రులు అసహానానికి గురై ఇటీవల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు ఉన్న మిమ్మల్ని 11 సీట్లకే పరిమితం చేశారు. దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా నేడు రౌడీ మూకల్ని, గంజాయి బ్యాచ్‌లను పరామర్శించేందుకు తెనాలి వచ్చావంటే ఏమని అనుకోవాలో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జేబు దొంగల సంఘానికి నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు మిగిలిపోయారు. పొదిలిలో మహిళలపై చెప్పులు, రాళ్లతో దాడులు చేయించావ్... సాక్షి ఛానల్ డిబేట్ లో అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందించలేదు.. ప్రజా సమాజానికి ఉపయోగపడే విధంగా ఎన్నడూ కూడా జగన్ మోహన్ రెడ్డి దగ్గర కానీ, సాక్షి పత్రికలో గానీ, సాక్షి మీడియాలో గానీ ఎక్కడ కనిపించిన దాఖాలలు లేవు. జగన్ మోహన్ రెడ్డి అతని పార్టీ అనుచరులు వికృతం తయరై.. ఏదో రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారు. దానినే మీరు అనుసరించుకుంటూ ముందుకు పోవాలనుకుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సింగయ్య మరణనికి కారణమైన వారు ఏ స్థాయిలో ఉన్న చట్టప్రకారం వారికి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఏంతైనా ఉంది’’ అని అన్నారు.

Comments