చిత్తూరు జిల్లా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది*
*తోతాపూరి మామిడి గిట్టుబాటు ధరగా కి.లో రూ.12/- గా ప్రభుత్వం నిర్ణయిచ్చింది*
*మామిడి రైతుల సందేహాలు నివృత్తికి హెల్ప్ లైన్ ఏర్పాటు . . 08572-242777, 9491077325 నెంబర్ లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు*
*:జిల్లా ఇంచార్జ్ కలెక్టర్*
చిత్తూరు, జూన్ 17 (ప్రజా అమరావతి): చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, అపోహలను నమ్మి ఆందోళన చెందవద్దని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ జి. విద్యాదరి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా సచివాలయం లోని సమావేశ మందిరం లో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ తోతాపూరి మామిడి కాయల కొనుగోలు ప్రక్రియ పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 98 వేల ఎకరాలలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి పండిస్తున్నారన్నారని, పంట దిగుబడి క్రమంగా పెరుగుతున్నదన్నారు. జిల్లాలో 35 ప్రొసెసింగ్ యూనిట్ లు ఉండగా అందులో 27 పరిశ్రమలు మాత్రమే మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేస్తున్నాయన్నారు. గుజ్జు పరిశ్రమల ద్వారా ప్రతి రోజూ దాదాపు 7 వేల మెట్రిక్ టన్నుల మామిడి ప్రొసెసింగ్ జరుగుతున్నదన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మామిడి దిగుబడి అధిక మొత్తంలో ఉంటున్నదని, 2023 సం.లో సైతం అధిక దిగుబడి వచ్చిందని, ఆ సమయంలో గుజ్జు పరిశ్రమలు అధిక మొత్తంలో మామిడి పండ్ల ప్రొసెసింగ్ చేయడం జరిగిందని, అందులో దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇంకా పరిశ్రమల వద్ద మిగిలి ఉందని అన్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం గుజ్జు పరిశ్రమల నుండి డిమాండ్ తక్కువగా ఉందని, దీనితో మామిడి ధర తక్కువ పలుకుతున్నదన్నారు. మామిడి రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతో తోతాపురి మామిడి కి.లో రూ.12/-గా ధర నిర్ణయిస్తూ జూన్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిందని, ఇందులో గుజ్జు పరిశ్రమలు రూ.8/-లు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.4/- మద్ధతు ధర ను రైతుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని తెలిపారు. 38 ర్యాంపులు, 2 మండీల వద్ద అమ్ముకునే రైతులకు కూడా ప్రభుత్వం రూ.4/- మద్ధతు ధర ను అందిస్తుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడానికి జిల్లాలో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. మామిడి కాయల కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రతి ప్రొసెసింగ్ యూనిట్, మండీలు, ర్యాంప్ వద్ద హార్టీకల్చర్, అగ్రి కల్చర్ అసిస్టెంట్ మరియు ఒక వి ఆర్ ఓ తో కూడిన రెండు బృందాలను ఏర్పాటు చేశామని, ఒక బృందం ఉదయం 8 గం. ల నుండి మ.2 గం.ల వరకు, మరొక బృందం మ. 2 గం. ల నుండి రాత్రి 8 గం. ల వరకు తోతాపురి మామిడి రైతుల వివరాలు, వారి ఆధార్, బ్యాంక్ అకౌంటుల వివరాలు, తదితరాలను సేకరించి పంపుతారని, రైతులకు సబ్సిడీ కొరకు ఈ వివరాలను ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ప్రతి మండలాలకు మండల స్థాయి ఇంచార్జ్ లను నియమించడం జరిగిందని, ప్రొసెసింగ్ యూనిట్ లు ఎక్కువగా ఉన్న పూతలపట్టు, తవణంపల్లి, గుడిపాల మండలాలకు జిల్లా స్థాయి అధికారులను ఇంచార్జ్ లుగా నియమించి పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియను జిల్లా స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని, జిల్లా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, మూడు షిఫ్ట్ లలో సిబ్బంది పని చేస్తారన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు ఎలాంటి సందేహాలు ఉన్నా08572-242777, 9491077325 హెల్ప్ లైన్ కు సంప్రదించాలని కోరారు. మార్కెటింగ్ శాఖ ఏ డి, లీగల్ మెట్రాలజీ మరియు డి టి ల ద్వారా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ర్యాంప్ లు, మండీల వద్ద మామిడి కొనుగోలు ధరలను పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ప్రొసెసింగ్ యూనిట్లు జూన్ 7 నుండి గుజ్జు తయారీ ప్రారంభించాయని, అప్పటి నుండి రైతులు, కొనుగోలుదారులు, ప్రొసెసింగ్ యూనిట్ ల తో జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తున్నదన్నారు. తోతాపూరి మామిడి కొనుగోలు కు సంబంధించి రైతులు ఆందోళనకు గురి కావడం జరుగుతున్నదని, మామిడి ధరను క్రమంగా రూ.6/- కు తగ్గకుండా చూస్తున్నామని, రైతులు గుర్తించాలన్నారు. రైతులు తొందరపడి పక్వానికి పక్వానికి రాని మామిడికాయలు కోసి తీసుకురావడం వల్ల అది పండు మారడానికి ఎక్కువ రోజులు సమయం తీసుకుని ఫలితంగా నాణ్యత తగ్గిపోవడమే కాకుండా ఎక్కువ ప్రాసెసింగ్ చేయడానికి ఉండదు. రైతులు పక్వానికి వచ్చిన కాయలను కోసి ఫ్యాక్టరీలకు తరలించాలి ఫ్యాక్టరీల వద్ద ఆలస్యం అవుతున్నప్పుడు దయచేసి కాయలు కోతలు కొంతమేరకు ఆలస్యం చేయాలి లేనట్లయితే కాయలు కోసి ఫ్యాక్టరీ ముందు రెండు రోజులు మూడు రోజులు నిలపడం వల్ల కాయల నాణ్యత చెడు పోతుంది. పండు బారుతాయి. ఏ వారం ఎంత కాపు వస్తుంది, జూన్ మాసం, జూలై మాసం, ఆగస్టు మొదటి వారం లోపల మామిడికాయలు నాణ్యతగా ఉంటాయని తెలిపారు గత ఎనిమిది రోజుల నుంచి తోతాపూరి మామిడికాయలు 38 వేల టన్నులు ఫ్యాక్టరీలకు సరఫరా చేయడం జరిగింది. ప్రతి రైతు పండించిన చివరి మామిడికాయ వరకు, ఆగస్టు సీజన్ వరకు సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. రైతులు వెంటవెంటనే కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించడం కాకుండా అందరూ రైతులకు అవకాశం వచ్చేలా సహకరించాలని మామిడి రైతులకు జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment