ఆగ్రోస్ సెంట్రల్ వర్క్ షాప్ ను సందర్శించిన మాలేపాటి.
*ఆగ్రోస్ సెంట్రల్ వర్క్ షాప్ ను సందర్శించిన మాలేపాటి

*

 గుంటూరు  (ప్రజా అమరావతి);


         గుంటూరు జిల్లా, నల్లపాడు గ్రామంలోని ఏపీ ఆగ్రోస్ సెంట్రల్ వర్క్ షాప్ ను ఈరోజు సందర్శించిన రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు గారు. ఈ కేంద్రంలో తయారయ్యేటువంటి వ్యవసాయ యాంత్రిక పరికరాలైన రోటోవేటర్లు, సీడ్ డీల్స్, కల్టివేటర్స్, మల్చర్, రౌండ్ బేలర్స్, స్క్వేర్ బేలర్స్, షుగర్ కేన్ ట్రాన్స్ ప్లాంటర్, పాడీ ట్రాన్స్ ప్లాంటర్ వంటి అన్ని పరికరాలను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి సిబ్బందితో మాట్లాడి ఆగ్రోస్ అభివృద్ధికి నిరంతరం పనిచేయాలని, పరికరాల నాణ్యత విషయంలో శ్రద్ధ వహించాలని సూచించడం జరిగింది. ఈ సందర్భంగా వీరితోపాటు ఆగ్రో సంస్థ జనరల్ మేనేజర్ ఎం.సి రాజమోహన్ గారు, గుంటూరు జిల్లా మేనేజర్ ఆర్.వి.వి నాగ మురళి గారు ఉన్నారు.
Comments