మహిళా సాధికారతే సీఎం చంద్రబాబు ప్రధాన ఎజెండా : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
హోటల్ వివాంత లో ఎఫ్.ఐ.సి.సి.ఐ -ఎఫ్.ఎల్.వో 21 వ ఛాప్టర్ ప్రారంబోత్సవం
ముఖ్యఅతిధిగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరు
విజయవాడ (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతే ప్రధాన ఎజెండా కృషి చేస్తుంది. రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల స్థాపన ద్వారా మధ్య తరగతి కుటుంబాల్లోని మహిళల ఆర్థికాభివృద్ధి సాధించారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో మహిళలు ఏ రంగంలోనైనా విజయం సాధించగలరని ఆపరేషన్ సింధూర్ తో నిరూపించాడని మహిళల శక్తిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కొనియాడారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( FICCI)FLO 21వ చాఫ్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ హోటల్ వివాంత లో బుధవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫిక్కీ సభ్యులకు అభినందనలు తెలిపారు.
అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఫీక్కీ FLO 21వ చాఫ్టర్ విజయవాడ ఛైర్మన్ గా నియమితులైన అమృత కుమార్ కి శుభాభినందనలు తెలిపారు. ఇప్పటికే 20 దేశాల్లో తన సేవలు అందిస్తున్న ఫీక్కీ విజయవాడలో 21వ ఛాప్టర్ ప్రారంభించటం చాలా సంతోషంగా వుందన్నారు.
టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఎపీలో మహిళా సాధికారతకు పునాది వేశారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి వారిలో ఆత్మవిశ్వాసం నింపారన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల సాధికారతే ధ్యేయంగా కృషి చేస్తున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ లో రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు, దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మహిళలకు అండగా నిలబడి విజయపథం వైపు నడిపిస్తున్నారని తెలిపారు.
ఫిక్కీ 21వ చాఫ్టర్ విజయవాడలో ప్రారంభించటంతో స్థానిక మహిళలకు జాతీయ స్థాయిలో అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఫిక్కీ 21వ చాఫ్టర్ విజయవాడ మహిళ పారిశ్రామికవేత్తల్లో కొత్త మార్పులు తీసుకువస్తుందన్నారు. తను కూడా మహిళల ఆర్థికాభివృద్దికి వికసిత్ పంచాయతీ అనే కార్యక్రమం ద్వారా గ్రామీణా మహిళలకు అవసరమైన శిక్షణ ఇప్పించి, వస్తు ఉత్పత్తికి కావాల్సిన పరికరాలు అందిస్తూ మార్కెటింగ్ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫిక్కీ సభ్యులకు అండగా వుంటూ వారికి కావాల్సిన సహకారం అందిస్తానన్నారు. తనని ఆహ్వానించిన FLO (FICCI Ladies Organisation) సభ్యురాలు పద్మ రాజ్‌గోపాల్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫీక్కీ FLO నేషనల్ ప్రెసిడెంట్ పూనమ్ శర్మ, మార్గదర్శి ఎమ్.డి శైలజ కిరణ్, రేష్మ సరితలతో పాటు ఫిక్కీ FLO విజయవాడ ఛాప్టర్ సీనియర్ వైస్ చైర్మన్ సుప్రియ మలినేని, వైస్ చైర్మన్ రజనీ చిత్ర, సెక్రటరీ అట్లూరి సుమ బిందు, జాయింట్ సెక్రటరీ దీప్తి చలసాని, కోశాధికారి తులజ భవానీ దేవినేని, జాయింట్ ట్రెజరర్ అనీలా నార్ల లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment