*-ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి-ప్రాతూరు లో రాష్ట్ర కార్యాలయ ఏర్పాటు కు బుధవారం పూజా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్, కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ నేతృత్వంలో సమీప ప్రాంతాల కళాకారులు, కళాపోషకులు, వివిధ కళాపరిషత్తుల నిర్వాహకులు, పలువురు రచయితలు, ఆత్మీయులు హాజరై ఏపీ నాటక అకాడమీ కార్యాలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ...కళాకారులకు అండగా ఉంటామని హామీనిచ్చారు. త్వరలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చేయూతతో రంగస్థలం, వృత్తి కళాకారులకు భరోసాతో కూడిన వరాలు వెలువడనున్నట్లు చెప్పారు. కళాకారుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వకపోగా రంగస్థల ప్రత్యేక రోజులను నిర్లక్ష్యం చేశారని... ప్రతిష్టాత్మకమైన నంది, హంస, కందుకూరి అవార్డులు పట్ల చిన్న చూపుచూశారని గుర్తుచేశారు. కరోనా సమయంలోనూ కళాకారుల బాగోగులు పట్టించుకోకుండా నడిరోడ్డున పడవేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్, యువనేత, మంత్రివర్యులు నారా లోకేష్ కళలు, కళాకారులకు అండగా ఉంటున్నారని వివరించారు.
ఏపీ నాటక అకాడమీ కార్యాలయంలో ఆధునీకరణ పనులు మరో పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి కానున్నాయని.. అప్పుడు రాష్ట్రంలోని కళాకారులందరికీ ఆహ్వానం పంపి కార్యాలయం ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకుందామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాకారులు, దర్శకులు, రచయితలు కావూరి సత్యనారాయణ, చెరుకూరి సాంబశివరావు, పొగర్తి నాగేశ్వరరావు, పోపూరి నాగేశ్వరరావు, ఏపూరి హరిబాబు,నరేన్, రంగనాయకులు, హసన్, స్వామి , పిళ్ళా నటరాజ్, దొంతాల ప్రకాష్ , రావులపల్లి ఇన్నయ్య, బండారుపల్లి సాంబశివరావు, కోగంటి ప్రసాద్, అర్వపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment