గుంటూరు, 29 జూన్ 2025 (ప్రజా అమరావతి):- కృత్రిమ మేధా ను వినియోగించుకొని ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా దేశంలోనే తొలిసారి రాష్ట్ర పోలీస్ శాఖ ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025ను విజయవంతంగా నిర్వహించిందని రాష్ట్ర డీజీపీ హరిష్ కుమార్ గుప్తా తెలిపారు.
ఆదివారం సాయంత్రం చౌడవరంలోని ఆర్వీఆర్ అండ్ జెసీ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025 ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర డిజీపీ హరిష్ కుమార్ గుప్తా పాల్గోన్నారు. ఈ సంధర్భంగా జరిగిన సభలో రాష్ట్ర డీజీపీ హరిష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జూన్ 27 నుంచి 29 వరకు నాలెడ్జ్ పార్టనర్ 4 సైట్ ఏఐ కంపెనీ, ఆర్వీఆర్ అండ్ జెసీ ఇంజనీరింగ్ కళాశాల హోస్టింగ్ తో ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025 నిర్వహించటం జరిగిందన్నారు. హ్యక్ థాన్ కు 160 మంది ధరఖాస్తు చేసుకోగా వాటిలో జనరేటీవ్ ఏఐ, ఎజెంటీక్ ఏఐ 60 కంపెనీలను, ఏఐ నిపుణులను ఎంపిక చేసుకొని కృత్రిమ మేధా సహాయంతో నేరాలు నియంత్రణ
, పర్యవేక్షణ, దర్యాప్తు లోని సవాళ్ళుకు ఉత్తమమైన పరిష్కారాలను ఆవిష్కరించటం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 30 మందికి పైగా సీనియర్ ఐపీఎస్ అధికారులు, యువ ఐపీఎస్ లు నేరాల నియంత్రణ, దర్యాప్తులో ఉన్న అనేక సమస్యల పరిష్కారాలకు ఏఐ నిపుణుల సహాయంతో కృత్రిమ మేధాను వినియోగించుకునే ప్రక్రియ పై నిర్వహించిన కసరత్తు ఫలవంతమైందన్నారు. వీటిని రానున్న ఆరు నెలల్లో పోలీస్ శాఖలో అమలు పరిచి నేరాలను పటిష్టంగా నియంత్రించటంతో పాటు, ప్రజలకు పోలీస్ సేవలను మెరుగ్గా అందించటం జరుగుతుందన్నారు. భవిష్యత్తులోను పోలీస్ శాఖ కృత్రిమ మేధాను మరింతగా వినియోగించుకొనేలా ప్రణాళికలు రూపొందిస్తుందని, ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించటం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ శాఖలలో కృత్రిమ మేధాను వినియోగించటాన్ని పోత్సహిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందన్నారు. కృత్రిమ మేధాను పోలీస్ శాఖలో అమలు చేయటం ద్వారా నేరాలు జరగటానికి అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేసి నేరాలు నియంత్రించటం పాటు మోసాలకు, నేరాలకు పాల్పడే వారిని, సైబర్ నేరగాళ్ళను పోలీసులు అటోమోటిగ్గా ట్రాక్ చేసే వీలు కలుగుతుందన్నారు. నేరాలకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు.
4సైట్ఏఐ సీఐఓ సూర్య కొత్తా మాట్లాడుతూ కృత్రిమ మేధాను వినియోగించుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర పోలీస్ శాఖ ఏఐ 4 ఆంధ్రా పోలీస్ హ్యక్ థాన్ 2025 నిర్వహించటం ప్రపంచంలోనే తొలిసారి అన్నారు. ప్రభుత్వ శాఖలలో కృత్రిమ మేధాను అమలు చేయటం వలన తక్కువ శ్రమతో 24 గంటలు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. రానున్న ఐదు సంవత్సరాల్లో జనరేటీవ్ ఏఐ, ఎజెంటిక్ ఏఐ లకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. కృత్రిమ మేధా లో నైపుణ్యాలు పెంపొందించుకోవటానికి ఆసక్తి ఉన్న ఉన్న ఇంజనీరింగ్ విధ్యార్ధులు 4సైట్ఏఐ సంస్థను సంప్రదిస్తే పూర్తి సహకారం అందిస్తామన్నారు.
హ్యక్ థాన్ లో ఎనిమిది విభాగాల్లో నిర్వహించిన పోటీలలో విజేతలకు రూ. 75,000 ,రన్నర్లకు రూ.50,000 చోప్పున మొత్తం రూ.10 లక్షల విలువ కలిగిన నగదు బహుమతులను రాష్ట్ర డీజీపీ హరిష్ గుప్తా అందించారు.
విజేతల వివరాలు.
S.NO
Use Case
Mentor
Winner
Runner UP
1
petition petition Management system
Vakul Jindal ,IPS, SP Viziangaram
controlled freaks
parabola 9
2
CCTNS CoPilot Engine
Sri Tushar Dudi, IPS , SP Bapatla
Calyirex 1
Blue query 2
3
Investigation of IT cases - 91 CrPC Analyzer
Dr Fakeerappa Kaginelli, IPS, DIG APSP
Xplormity
Quantum Mavericks
4
CDR/IPDR CoPilot Engine
Sri Kommi Prathap Siva Kishore , IPS, SP Elluru
AI gents
Parabola 9
5
Dial 112 Analyzer
Malika Garg, IPS
Owl AI
Infi Code Cups
6
Digital Service Records
B. Rajakumari ,IPS, IGP APSP
TripleD
AI luminati
7
whatsapp summarizer
Vakul Jindal , IPS
Pragya verse
serve smart
8
News Digest Summariser
Malika Garg , IPS, SP Battalion
Netra Rakshak
Dynamic Squirrels
సమావేశంలో ఐజీపీలు సీహెచ్ శ్రీకాంత్, బి రాజకుమారి, ఆర్వీఆర్ అండ్ జెసీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ కె శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు, ఏఐ కంపెనీలు, నిపుణులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
addComments
Post a Comment