ఏడాది విజయాలపై 'జనసేన' ప్రత్యేక వీడియో విడుదల.
*'కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను...'*
- *డిప్యూటీ సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న పవన్*
- *ఏడాది విజయాలపై 'జనసేన' ప్రత్యేక వీడియో విడుదల

*
- *సోషల్ మీడియా ట్రెండ్ తో చర్చనీయాంశం*
-
అమరావతి (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్ర రోజు రోజుకీ మరింత బలంగా, ప్రజల్లో విశ్వాసాన్ని సంపాదించుకుంటూ ముందుకు సాగుతోంది. డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి గురువారంతో ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ ఓ ఆసక్తికరమైన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది. “కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను” అనే వ్యాఖ్యతో ప్రారంభమయ్యే ఈ వీడియో ప్రస్తుతం పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

*జనసేన పాలనలో సాధించిన విజయాలు*:
ఈ వీడియోలో పవన్ కల్యాణ్ నాయకత్వంలో గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను హైలైట్ చేశారు. ముఖ్యంగా ప్ర‌తి ఇంటికీ మంచినీటి పంపిణీ, 55 గిరిజ‌న గ్రామాల‌కు 39 కిలోమీట‌ర్లు రోడ్లు వేయ‌డం, కుంకీ ఏనుగుల‌ను కర్ణాటక నుంచి ఆంధ్రాకి తీసుకురావ‌డం, ప్రైవేట్ ఎలక్ట్రీషియ‌న్‌ల‌కు సేఫ్టీ కిట్స్ అందించ‌డం వంటి తదితర అంశాలను స్టేటస్ వీడియోలో చూపించారు.

*రాజకీయ ప్రస్థానంలో గేమ్ ఛేంజర్‌గా పవన్*:
పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న ఈ ప్రత్యేక వీడియో, పవన్ ఒక సాధారణ రాజకీయ నేత స్థాయి నుంచి “గేమ్ ఛేంజర్”గా ఎలా ఎదిగారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. పిఠాపురంలో ఆయన సాధించిన తొలి ఎన్నికల విజయం ఆ ప్రాంతంలో పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్ అందించిన తీరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఆయన తిరగరాసిన విధానం వంటి అంశాలను వీడియోలో ప్రముఖంగా ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ సహనం, పట్టుదల, వ్యూహాత్మక పొత్తుల ద్వారా జనసేనను రాష్ట్ర రాజకీయాల్లో అగ్రస్థానానికి చేర్చినట్లు వివరించారు.

*పార్టీ శ్రేణులకు స్పూర్తి — ప్రజలకు భరోసా*:
ఈ వీడియో ద్వారా జనసేన పార్టీ తన శ్రేణులకు ఒక కొత్త ఉత్సాహాన్ని అందించడమే కాక, రాష్ట్ర ప్రజలకు తమ పాలన లక్ష్యాలను మరోసారి గుర్తు చేసింది. రాష్ట్ర అభివృద్ధికి, పారదర్శక పాలనకు తమ పార్టీ కట్టుబడి ఉందని ప్రజలకు గుర్తు చేయడమే లక్ష్యమని జనసేన పార్టీలు తెలిపాయి. పవన్ కల్యాణ్ ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో వీడియోలోని అంశాలతో వ్యాఖ్యాతలు చూశారు. సంకీర్ణ రాజకీయాల్లో తలెత్తే అంతర్గత విభేదాలను చాకచక్యంగా పరిష్కరిస్తూ, ఆయన ప్రదర్శించిన రాజకీయ జాతీయ పరిణతి ప్రధాని నరేంద్ర మోదీ వంటివారు, నటీనటుల ప్రశంసలు సైతం అందుకున్న విషయాలు చర్చనీయాంశం అయ్యాయి.

*ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు..:*
 వచ్చే సంవత్సరాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు పవన్ కల్యాణ్ కార్యాచరణ రూపొందించినట్లు జనసేన పార్టీ అధిష్టానవర్గాలు చెబుతున్నారు.

Comments