రాజానగరం (ప్రజా అమరావతి);
అటవీ భూముల పెంచడం లో, సంరక్షణ లో శాస్త్రీయ నైపుణ్యం పెంచే విధంగా శిక్షణా కేంద్రాల ఏర్పాటు..
రాష్ట్రంలో 23 శాతం భూ భాగం పచ్చదనంతో కలిగి ఉండేలా చర్యలు తీసుకోవడం లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతోందనీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు
గురువారం స్థానిక దివాన్ చెరువు అటవీ శాఖ శిక్షణా కేంద్రం లో శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం లో అటవీ అకాడమీ శిక్షణ కేంద్రం శాశ్వత భవనానికి రూ.18 కోట్లతో శంకుస్థాపన చెయ్యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తు తరాల కోసం పచ్చదనం కలిగిన ప్రాంతాల్ని అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి ఆదేశాల మేరకు మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రములో పచ్చదనాన్ని 23 శాతం వరకు పెంచాలనే సంకల్పంతో క్యాబినెట్‌లో ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, అందులో భాగంగా తొలిదశలో అందులో 50 శాతం మేరకు లక్ష్యాలను సాధించేందుకు పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చెయ్యడం జరిగిందన్నారు. రాజమహేంద్రవరం లో ఉన్న తాత్కాలిక శిక్షణ కేంద్రం లో రూ. 18 కోట్ల 34 లక్షలతో శాశ్వత శిక్షణా భవనానికి శంకుస్థాపన చెయ్యడం జరుగుతోందని వెల్లడించారు. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు. ఈ శిక్షణ కేంద్రం ద్వారా అడవులు స్థిరంగా నిర్వహించడానికి , పచ్చదనం పెంచడం పై అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. అటవీ అధికారులకు , ఫ్రంట్ లైన్ సిబ్బందికి నైపుణ్య అభివృద్ధి వెంటనే ఈ అకామిక్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గెష్ , ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామ కృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహా కిషోర్, అటవీ శాఖ ఉన్నతాధికారులు , విసి & ఎండి, ఎపిఎఫ్‌డిసి డాక్టర్ ఆర్ పి ఖజురియా , ఎపిసిసిఎఫ్ డాక్టర్ రాహుల్ పాండే, ఎపిసిసిఎఫ్ (హెచ్‌ఆర్‌డి & డబ్ల్యూఎల్) & చైర్మన్, బిఓసి, ఎ. పి. స్టేట్ ఫారెస్ట్ అకాడమీ (కాంపా) డాక్టర్ శాంతి ప్రియా పాండే, డైరెక్టర్, ఎపి స్టేట్ ఫారెస్ట్ అకాడమీ) డాక్టర్ బి. విజయ్ కుమార్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, రాజమండ్రి సర్కిల్ బి.ఎన్.ఎన్.మూర్తి, ఆర్ ఎం శ్రీమతి టి. జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment