*ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విడుదల తదితర అంశాలను రాజ్యసభ చైర్మన్ కు నివేదించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తాం*
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది: ప్రభుత్వ హామీల రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం చైర్మన్ డాక్టర్ ఎం తంబి దురై*
తిరుపతి, జూన్13 (ప్రజా అమరావతి): ప్రభుత్వ హామీలపై రోడ్లు మరియు జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌరవిమాన యానం, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు సంబంధించిన అంశాలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం తిరుపతి తాజ్ హోటల్ నందు సమీక్ష నిర్వహించి సమావేశంలో వచ్చిన పలు అంశాలను రాజ్యసభ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత మంత్రిత్వ శాఖల ద్వారా పెండింగ్ అంశాల పరిష్కార దిశగా చర్యలు చేపడతామని కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం తంబి దురై పేర్కొన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక తాజ్ హోటల్ నందు ప్రభుత్వ హామీల పై రాజ్యసభ అధ్యయనం సందర్శన బృందం చైర్మన్ ఆధ్వర్యంలో రోడ్లు మరియు జాతీయ రహదారులు, పర్యాటక శాఖ, పౌరవిమాన యానం, అటామిక్ ఎనర్జీ, కోల్ గనుల శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, కెనరా బ్యాంక్ మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ కమిటీ ప్రభుత్వ హామీల పై రాజ్యసభ చే ఏర్పాటుచేసిన కమిటీ అని దీనికి రాజ్యసభ చైర్మన్ భారత ఉపరాష్ట్రపతి గారు ఉంటారని తెలిపారు. సాధారణంగా పలు నియోజకవర్గాలకు చెందిన రాజ్యసభ సభ్యులు వారి నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలైన పెండింగ్ ప్రాజెక్టులు నిధుల విడుదల నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ప్రశ్నిస్తుంటారని వాటిపై ప్రభుత్వం ఇచ్చిన హామీల పై వాటి అమలు సమీక్షించడానికి ఈ ప్రభుత్వ హామీల రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం ఏర్పాటయిందని తెలిపారు. ఈ కమిటీ పలు రాష్ట్రాల సందర్శన చేసి సమీక్షిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సందర్శన చేయడం జరిగిందని, గౌరవ రాజ్యసభ సభ్యులు పార్లమెంటు నందు పలు ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, నిధులకు సంబంధించిన అంశాలు, తదితర వివరాలు అడుగుతూ ఉంటారని తెలిపారు. కార్యక్రమానికి ముందుగా సదరు కమిటీ గుజరాత్ రాష్ట్ర అహ్మదాబాద్ నందు ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటనలో పలువురు చనిపోయిన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు. గౌరవ భారత ప్రధానమంత్రి ఈ దుర్ఘటనపై మరియు బాధిత కుటుంబాలకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పెండింగ్ అంశాలపై చర్చించడం జరిగిందని సదరు సమీక్ష సమావేశం ఫలప్రదమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు, పూర్తి కావల్సిన ప్రాజెక్టులు వాటికి సంబంధించి సమస్యలను వాటి వివరాలను రాజ్యసభ చైర్మన్ కు వివరిస్తామని పరిష్కార దిశగా చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల విడుదలకు, ప్రాజెక్టుల పురోగతికి, జాతీయ రహదారులు తదితర వాటి అభివృద్ధి కొరకు అండగా ఉండేందుకు సుముఖంగా ఉందని అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల కొరత ఉన్నదని, ఏపీ అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని, దానికి నిధులకు అన్ని విధాలుగా అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాజెక్టులు నిర్మాణం అవుతున్నాయని అందులో ఏపీలో కూడా పలు ప్రాజెక్టులు నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. కొన్ని అటవీ ప్రాంతాలలో జాతీయ రహదారులు విస్తరణకు అవకాశం లేని వాటిలో పర్మిషన్ లు రావడం కష్టమని తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో రహదారుల అభివృద్ధికి పుష్కలంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పెద్ద ఎత్తున శాటిలైట్ రహదారులు వస్తున్నాయని అందులో ముంబై నుండి చెన్నై కి ఆంధ్రప్రదేశ్ మీదుగా సదరు రహదారి వెళుతుందని తద్వారా చెన్నై రాష్ట్రమే కాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ జాతీయ రహదారుల వలన కృష్ణపట్నం పోర్టు బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సదరు సమీక్ష సమావేశం ఫలప్రదమైందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన నిధులు, పూర్తి కావల్సిన ప్రాజెక్టులు వాటికి సంబంధించి సమస్యలను వాటి వివరాలను రాజ్యసభ చైర్మన్ కు వివరిస్తామని పరిష్కార దిశగా చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే కెనరా బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ హామీలపై రాజ్యసభ అధ్యయన సందర్శన బృందం సభ్యులు బీరేంద్ర ప్రసాద్ బైశ్య, నీరజ్ డాంగి, బాబుభాయ్ జెసంగ్‌బాయి దేశాయ్, ఆర్ గిరిరాజన్,మొహమ్మద్ నదిముల్ హక్ డా, మేధా విశ్రామ్ కులకర్ణి, ఆదిత్య ప్రసాద్, శ్రీమతి దర్శన్ సింగ్, లహర్ సింగ్ సిరోయా, జిగ్నేష్ సోలంకి పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా జెసి శుభం బన్సల్, జిల్లా ఫారెస్ట్ అధికారి వివేక్, కెనరా బ్యాంక్ ఎండి కే.సత్యనారాయణ రాజు, సిజిఎం అలోక్ అగర్వాల్, సర్కిల్ హెడ్ పాండురంగ మితాంతయ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండి అశోక్ చంద్ర, సీజీఎం సునీల్ కుమార్ చుగ్ పలువురు డీజీఎంలు వారి సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment