తాడేపల్లి (ప్రజా అమరావతి),
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఐ ఏ ఎస్ విజయ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
పోలీసు శాఖలోని కొన్ని కలుపు మొక్కల కారణంగా డ్రగ్స్, గంజాయి మాఫియా విస్తరించి యువత జీవితాలను నాశనం చేస్తోందన్నారు
గంజాయి కేసుల్లో అమాయికులను బలి చేసి కోట్లు సంపాదించాలనే స్కెచ్ వేస్తున్నారు
బొమ్మూరు సీఐ లక్ష్మణరెడ్డి, రాజానగరం సీఐ సుభాష్ కు మధ్య జరిగిన సంభాషణ సంచలనం రేపుతోంది
పేదలను, నిరపరాధులను గంజాయి కేసుల్లో ఇరికించి వారి కేసుల లెక్కలు చూపిస్తున్నారు
పోలీసుల మధ్య ఫోన్ సంభాషణ వింటే అమాయకులను అక్రమ కేసుల్లో ఎలా ఇరికిస్తారనేది స్పష్టంగా అర్ధమవుతోంది.
రాజానగరం సీఐకి.. బొమ్మూరు సీఐ.. ఎలా కేసులు బుక్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలని వివరించడం దుర్మార్గం..!
ఆరు ఫోన్ నంబర్లు తీసుకొని తాడేపల్లి ప్రేమ్ కుమార్, దాసరి సురేష్ కుమార్ (ఎస్సీ), లంకా పవన్, పట్నాల చిన్నసత్యనారాయణ (బీసీ), దారపు దుర్గ, తమ్మకట్ల అశోక్ కుమార్ అనే యువకులకు ఈ నంబర్లు ఇచ్చి..
జగ్గంపేట-రాజమండ్రి నుంచి ప్రయాణం చేయించి అరగంటకు ఒకసారి కాల్ చేస్తూ.. కాల్ ట్రాక్ రికార్డు చేయడంతో పాటు ఆ యువకుల దగ్గర గంజాయి పెట్టి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అక్రమ కేసుల్లో ఇరికించారు.
ఈ ఆరుగురు యువకుల ఫోన్ నంబర్లను తీసుకొని క్రైమ్ కి ముందే స్క్రీన్ ప్లే రాసి అమలు చేసి అమాయకులను గంజాయి కేసులో ఇరికించారు.
ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తామని ప్రకటనలు చేసి మాట నిలబెట్టుకోలేకపోతున్న ప్రభుత్వం.. అమాయకులపై అక్రమ కేసులు పెడుతోంది.
పోలీస్ శాఖలో ఉన్న కలుపు మొక్కలు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అమాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
పెద్దపెద్ద మహానగరాల్లో డ్రగ్స్ మాఫియా విక్రయించే కొకైన్.. మంగళగిరిలాంటి పట్టణంలో ఎలా దొరికింది. దీని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు.
విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు నిర్మూలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం
గ్రామీణ మరియు ఆదివాసీ ప్రాంతాల్లో ఒక్క డీ-అడిక్షన్ సెంటర్ లేదు
ముఖ్యంగా గిరిజనులకు సరైన ఉపాధి మార్గాలు చూపించి, వారికి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే ఈ పరిస్థితి రాదు.
సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి మత్తులో తెలుగుదేశం కార్యకర్తలు కొట్టుకున్న పరిస్థితి
రాయదుర్గంలో స్థానిక టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారు?
లిక్కర్ స్కామ్ అంటూ హడావిడి చేస్తున్న ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో గంజాయి వ్యాపారం జరుగుతుంటే ఏం చేస్తోంది.
నెలకు రూ.2000 కోట్లు చొప్పున ఇప్పటికి 20వేల కోట్లకు పైగా గంజాయి వ్యాపారం జరిగింది
దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలి.. జ్యూడీషియల్ ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చాలి.
ఈ ప్రభుత్వం ఈవెంట్లు, స్టేట్మెంట్లకే పరిమితవుతోంది
డ్రోన్లు, పీ-4, టూరిజం, సుపరిపాలన అంటూ ఈవెంట్లు చేస్తున్నారు తప్ప గంజాయి లాంటి సమస్యను పట్టించుకోవడం లేదు
రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
ఈ మాఫియాలో 30శాతం పోలీసులకు వెళ్తుంటే.. మిగిలినది అధికారంలో ఉన్న నాయకులకు వెళ్తోంది.
రెవెన్యూ ఇంటెలిజెన్స్ నార్కోటిక్ బ్యూరో గంజాయి స్మగ్లింగ్ లో ఏపీ ప్రధమ స్థానంలో ఉందని నివేదిక ఇచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయినట్లే..
పోలీసులు, నాయకులు, గంజాయి మాఫియా కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు.
addComments
Post a Comment