*ఏ.డీ./డీఐ పిఆర్వో గా బాధ్యతలు స్వీకరించిన పద్మజ !*
వైయస్సార్ కడప జిల్లా, జూన్ 13 (ప్రజా అమరావతి): సమాచార పౌర సంబంధాల శాఖ జిల్లా సహాయ సంచాలకులు (ఏ.డి.)గా పద్మజ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు.
అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ పద్మజ మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా లో సహాయ సంచాలకులు (ఏ.డి.)గా విధులు నిర్వహిస్తూ ప్రస్తుతం సాధారణ బదలీపై కడప జిల్లాకు రావడం జరిగిందన్నారు. ఈ జిల్లాలో ఏ.డీ.గా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సలహాలు, సూచనలు పాటిస్తూ.. శాఖా పరంగా, జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు, అధికార కార్యక్రమాలను మీడియా ద్వారా మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యాలయంలో అందరూ బాధ్యతాయుతంగా కలిసికట్టుగా కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ జిల్లా అభివృద్ధిలో తమవంతు భాగస్వాములు కావాలని ఈ సందర్బంగా ఆమె కోరారు.
ఈ సందర్బంగా ఏ.ఈ.ఐ.ఈ శ్రీనివాస రావు, డివిజనల్ పిఆర్వో సునీల్ సాగర్, పిఆర్వో రవికుమార్,ఏవీఎస్ నాగయ్య, రికార్డ్ అసిస్టెంట్ ఈశ్వరయ్య, ఇతర సిబ్బంది ఏడికి అభినందనలు తెలియజేశారు.
addComments
Post a Comment