సేవలకు గుర్తింపు...తాడేపల్లి రోటరీకి 15 అవార్డులు.
*సేవలకు గుర్తింపు...తాడేపల్లి రోటరీకి 15 అవార్డులు

*
  
తాడేపల్లి (ప్రజా అమరావతి);

          హైదరాబాద్ హైందవ కన్వెన్షన్ లో ఇటీవల రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన రోటరీ జిల్లా 3150 అవార్డుల మహోత్సవ కార్యక్రమంలో 2024-25 సంవత్సరానికి విశిష్ట సేవలందించినందుకు గాను గుర్తింపుగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 15 అవార్డులు, మెమొంటోలు, సర్టిఫికెట్స్ అందుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన 3150 జిల్లా గవర్నర్ శరత్ చౌదరి చేతుల మీదగా రోటరీ అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ డయాలసిస్ పరుచూరి కిరణ్ కుమార్ అవార్డులు అందుకున్నారు. 

ఈ సందర్భంగా వడ్డేశ్వరం దీపిక రెస్టారెంట్ ఆవరణలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అధ్యక్షులు రావూరి రమేష్ బాబు మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తాడేపల్లి రోటరీ పూర్వ అధ్యక్షులు జంగాల వెంకటేష్, మున్నంగి వివేకానంద రెడ్డి, పరుచూరి కిరణ్ కుమార్ ల క్లబ్ సేవ స్ఫూర్తిని కొనసాగిస్తూ 2024- 25 సంవత్సరం రోటరీ చేసిన సేవలను గుర్తించి అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. కుంచనపల్లి, తాడేపల్లి(సీతానగరం), మంగళగిరి (ఇందిరానగర్) యూపీహెచ్సీలలో మౌలిక వసతులు, ఏసీలు, రిప్రజెంటర్, కంప్యూటర్స్, ఆఫీస్ ఫర్నిచర్ తదితర పరికరాలు అందజేయడం జరిగిందన్నారు. క్రీడలను ప్రోత్సహించుటకు రోటరీ క్రీడాకారులకు అవసరమైన కిట్లు, మెడల్స్ అందజేశామన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినాయక చవితికి మట్టి ప్రతిమలు పంపిణీ చేశామన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్స్, విద్యార్థినిలకు సైకిల్స్ అందజేయడం జరిగిందన్నారు. అమరావతి క్యాపిటల్ క్లబ్ పేరిట అమరావతి ప్రాంతంలో నూతన క్లబ్ ను స్పాన్సర్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాడేపల్లి రోటరీ మంగళగిరిలోని అక్షయపాత్ర ఫౌండేషన్ వారి కిచెన్ కు ఆరు లక్షల రూపాయలు వేయడంతో కోల్డ్ స్టోరేజీ క్యాబిన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో కూడా రోటరీ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చార్టర్ ప్రెసిడెంట్ జంగాల వెంకటేష్, 3150 డిస్ట్రిక్ట్ చైర్మన్ ఫర్ డయాలసిస్ పరుచూరి కిరణ్ కుమార్, సెక్రెటరీ ఆర్ సుకుమార్ రెడ్డి, రోటోరియన్స్ కాట్రగడ్డ శివన్నారాయణ, రాజేష్, నగేష్, జెట్టి శ్రావణి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Comments