మూడేళ్ల కాలపరిమితి నిబంధన తొలగింపుపై పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సురేశ్ కుమార్, ఐ.ఏ.ఎస్. ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెప్మా ఆర్పిలు.
15 వ ఏక్సిక్యూటివ్ కమిటీ మీటింగ్ నందు పాల్గొన్న పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి ఇతర ఉన్నతాధికారులు
తాడేపల్లి మెప్మా ప్రధానకార్యాలయం నందు పలు సూచనలు చేసిన పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సురేశ్ కుమార్, ఐ.ఏ.ఎస్.
తాడేపల్లి (ప్రజా అమరావతి): తాడేపల్లిలోని మెప్మా ప్రధాన కార్యాలయంలో మంగళవారం మెప్మా ఆర్పీలు పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సురేశ్ కుమార్, ఐ.ఏ.ఎస్., మరియు మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్. తేజ్ భరత్, ఐ.ఏ.ఎస్. ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ ప్రభుత్వంవిధించిన మూడు సంవత్సరాల పద్దతి ఉత్తర్వులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేయడం ద్వారా ఉద్యోగ భద్రత లభించిందని వారు తెలిపారు. ఇకపై ధైర్యంగా విధులు నిర్వహిస్తూ మహిళల ఆర్థికాభివృద్ధిలో మెరుగైన ఫలితాలు చూపిస్తామని ఆర్పీలు హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం 15వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఛైర్మన్ మరియు పట్టణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్. సురేశ్ కుమార్, ఐ.ఏ.ఎస్. మాట్లాడుతూ P4 పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 20% అతి పేద కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడం అనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ దిశగా ఆర్పీలు మరియు మెప్మా సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
ఆర్పీలకు అందించిన ట్యాబ్‌లలో మెప్మా మహిళాకాశం యాప్ ఉపయోగించి వారు చేసే విధులు సులభతరం చేయడంపై సమీక్ష నిర్వహించారు. అలాగే, మెప్మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న MLCC మాడ్యూల్‌ను మెరుగ్గా వినియోగించుకోవాలని సూచించారు. దీని ద్వారా బ్యాంకులు మరియు మెప్మా సిబ్బంది లోన్ ఆమోద ప్రక్రియను ఆన్లైన్‌లో వేగంగా పూర్తి చేయవచ్చు. దీంతో ఫేక్ లేదా డూప్లికేట్ లోన్‌లను నిరోధించడం సాధ్యమవుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో మెప్మా విభాగానికి సంబంధించిన హ్యూమన్ రిసోర్స్ పాలసీ సమస్యలపై ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సభ్యులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
addComments
Post a Comment