తాడేపల్లి (ప్రజా అమరావతి);
గ్రామీణ ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, జీవనోపాధుల భద్రత కల్పించటం దృష్టిలో ఉంచుకుని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 1 లక్ష ఎకరాలలో పండ్ల మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.
*పథకం ఉద్దేశ్యం:*
•
ఎంజిఎన్ఆర్ఇజిఎ చట్టం, షెడ్యూల్ I, పేరా (5) లో పేర్కొన్న ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతుల (కుటుంబానికి కనీసం 0.25 ఎకరాల నుంచి గరిష్టంగా 5 ఎకరాల భూమి కలిగిన రైతుల) పొలాల్లో బాహువార్షిక పండ్లు, పూల తోటల ద్వారా జీవనోపాధుల భద్రత కల్పించటం, ఉత్పాదక ఆస్తులను అభివృద్ధి చేయటం, అలాగే కరవుపీడిత ప్రాంతాలలో భూమి, పర్యావరణాన్ని శాశ్వత ప్రాతిపదికపై పరిరక్షించడం.
• పండ్ల తోటల నిర్వహణ ద్వారా 2 లేదా 3 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం లబ్దిదారునికి 100 రోజుల వేతన ఉపాధి కల్పించడం.
• లబ్దిదారుల పొలాల్లో గుంతలు తీయడం, మొక్కల కొనుగోలు, నాటడం, ఎరువులు, సంరక్షణ, నీరుపోసే పనులకు 100% ఆర్థిక సహాయం ప్రభుత్వం అంది౦చడం.
• ఉద్యానవన శాఖ సమన్వయంతో ఎంపికైన లబ్దిదారులకు తగిన శిక్షణ, సాంకేతిక పర్యవేక్షణ ద్వారా తోటల నిర్వహణకు అవసరమైన నైపుణ్యాలను అందించడం.
*రైతుల పొలాల్లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం*
•
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు అంటే 8-7-2025 తేదీన 25,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్నిచేపట్టాo.
• ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, వీరపనేని గూడెం గ్రామంలో బండి శ్రీనివాస్ రెడ్డి అనే రైతు పొలంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ వి.ఆర్. కృష్ణ తేజ మైలవరపు, ఈజిఎస్ సంచాలకులు వైవీకే షణ్ముఖ కుమార్ మొక్కలు నాటారు.
addComments
Post a Comment