*పి 4 కార్యక్రమం అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలి: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*
*మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు...పి 4 సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే*
*లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలి...*
గుడివాడ జులై 16. (ప్రజా అమరావతి):పేదరిక నిర్మూలన లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి 4 కార్యక్రమం అమలుపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.
బుధవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు మరియు పి 4 సభ్యులతో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ (పి 4) అమలు పురోగతిపై ఎమ్మెల్యే రాము సమీక్షించారు.
అంశాల వారీగా అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము.... సమన్వయంతో ముందుకు సాగుతూ ప్రణాళిక బద్ధంగా అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.పి 4 అమలుకు తాను అన్ని విధాలుగా సహకరిస్తానని అధికార యంత్రాంగానికి ఆయన భరోసా ఇచ్చారు. సమస్యలు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనలో పి 4 కార్యక్రమం కీలకంగా వ్యవహరించనున్నదని, పూర్తిస్థాయిలో అమలు అయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.అర్హులైన పేద కుటుంబాలను గుర్తించడంతో పాటు వారిని దత్తత తీసుకునేందుకు మార్గదర్శిలను గుర్తించి ప్రోత్సహించేలా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా గుడివాడ నియోజకవర్గంలో పి 4 లక్ష్యాలను సాధిస్తామని ఎమ్మెల్యే రాము పునరుద్గాటించారు.
ఈ సమావేశంలో ఎండిఓ విష్ణు ప్రసాద్, గుడివాడ మండల టిడిపి అధ్యక్షుడు వాసే మురళి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, గుడివాడ నియోజకవర్గ పి 4 సభ్యులు పాల్గొన్నారు.
addComments
Post a Comment