భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో 8వ ఇంటర్-రీజినల్ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్
విజయవాడ (ప్రజా అమరావతి);
భారత ఆహార సంస్థ (ఎఫ్ సి ఐ) ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ విభాగం 8వ ఇంటర్-రీజినల్ క్రికెట్ టోర్నమెంట్ (సౌత్ జోన్)ను విజయవాడ నున్న లోని గ్రీన్ హిల్స్ అరీనాలో జూలై 15 -16 తేదీలలో నిర్వహించనుంది.
రెండు రోజుల పాటు జరిగే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో, “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలతో పాటు జోనల్ కార్యాలయ జట్టు కూడా పాల్గొంటాయి. క్రీడా స్ఫూర్తికి ఆదర్శంగా టోర్నమెంట్ నిలుస్తుందని ఎఫ్ సి ఐ తెలిపింది.
addComments
Post a Comment