*లంచం కేసులో ఇన్సూరెన్స్ కంపెనీ అధికారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన సీబీఐ కోర్టు*
అమరావతి (ప్రజా అమరావతి);
అధికార దుర్వినియోగం ఆరోపణ నిర్ధారణతో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మైక్రో ఆఫీస్ ఉద్యోగి కోలా రామ నరసింహంను సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటిస్తూ 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధించింది.
గతంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కందుకూరు బ్రాంచ్ కి చెందిన మైక్రో ఆఫీస్‌లో ఇన్-చార్జ్ డెవలప్‌మెంట్ గ్రేడ్ వన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తూ లంచం తీసుకుంటుoడగా రామ నరసింహంను సిబిఐ పట్టుకుంది.
తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, గేదె మరణానికి సంబంధించిన బీమా క్లెయిమ్ ఫైల్ పై సంతకం కోసం వచ్చిన లబ్ధిదారు దగ్గరి నుంచి రూ.10,000/- లంచం డిమాండ్ చేసిన క్రమంలో, బాధితుడి పిర్యాదు మేరకు సీబీఐ వల పన్ని నిందితుడు ఫిర్యాదుదారు నుండి పది వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం, శ్రీ కోలా రామ నరసింహంపై సీబీఐ 11.07.2017న కేసు నమోదు చేసింది. దర్యాప్తు తర్వాత, ఆయనపై 27.10.2017న సిబిఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది, విచారణ పూర్తి చేసిన సీబీఐ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి, తదనుగుణంగా శిక్ష విధించింది.
addComments
Post a Comment